Vadda numdi meeru sooda valasi kaaga

వద్ద నుండి మీరు చూడ వలసి కాక
Language

(॥పల్లవి॥)
వద్ద నుండి మీరు చూడ వలసి కాక
కొద్దిమీరి నేనే పైకొన కుండేనా

(॥వద్ద నుండి॥)
కగ్గి తనచేఁతలకు కన్నుల మొక్కినదాన
దగ్గరి తనకు మొక్కఁ దడవా నాకు
యెగ్గు లెంచక పనులు యే మైనాఁ జేసినదాన
వొగ్గి వూడిగాలు సేయ కూర కుండేనా

(॥వద్ద నుండి॥)
బింకాన నాఁడిట్టె తన్ను పేరఁ బిలిచినదాన
అంకెల తనతో మాట లాడ కుండేనా
కంకి తనసుద్దులకు గక్కన నవ్వినదాన
యింకా సరస మాడ కిటు మానేనా

(॥వద్ద నుండి॥)
చెమటమేని తనకు చేలా గిచ్చినదాన
అమరఁ గాఁగిఁట గూడ నరుదా నాకు
సముఖుఁ డై శ్రీవెంకటేశుఁడు దానె ననుఁ బొందె
తమకాన నిద్దరికి తతి పోయినా

(||pallavi||)
vadda nuṁḍi mīru sūḍa valasi kāga
kŏddimīri nene paigŏna kuṁḍenā

(||vadda nuṁḍi||)
kaggi tanasem̐talagu kannula mŏkkinadāna
daggari tanagu mŏkkam̐ daḍavā nāgu
yĕggu lĕṁchaga panulu ye mainām̐ jesinadāna
vŏggi vūḍigālu seya kūra kuṁḍenā

(||vadda nuṁḍi||)
biṁkāna nām̐ḍiṭṭĕ tannu peram̐ bilisinadāna
aṁkĕla tanado māḍa lāḍa kuṁḍenā
kaṁki tanasuddulagu gakkana navvinadāna
yiṁkā sarasa māḍa kiḍu mānenā

(||vadda nuṁḍi||)
sĕmaḍameni tanagu selā gichchinadāna
amaram̐ gām̐gim̐ṭa gūḍa narudā nāgu
samukhum̐ ḍai śhrīvĕṁkaḍeśhum̐ḍu dānĕ nanum̐ bŏṁdĕ
tamagāna niddarigi tadi poyinā