వదలవు నా కొంగు యెవ్వతెను నేను
(॥పల్లవి॥)
వదలవు నా కొంగు యెవ్వతెను నేను
యెదుటనే నిలుచుండ నెవ్వతెను నేను
(॥వద॥)
తనువుపైఁ జెయి వేసి దగ్గరఁ బిలిచేవు నీ-
వనితలలోన నెవ్వతెను నేను
మనసులరసి వేరేమాటలకుఁ దీసేవు
యెనలేక యింతదానికెవ్వతెను నేను
(॥వద॥)
పచ్చిగా నవ్వేవు నాతోఁ బైపై నీ కొలువుకు
వచ్చిన సతులలో నెవ్వతెను నేను
మచ్చిక నటించి నన్ను మాపుదాఁకాఁ బొగడేవు
హెచ్చిన సవతులలో నెవ్వతెను నేను
(॥వద॥)
చద్దికి వేఁడికి నాతో సరసాలే యాడేవు
వద్దనుండే వారిలో నెవ్వతెను నేను
కొద్దితో శ్రీవేంకటేశ కూడితివి నన్ను నిట్టే
యిద్దరమే యెక్కుడనే వెవ్వతెరా నేను
(||pallavi||)
vadalavu nā kŏṁgu yĕvvadĕnu nenu
yĕduḍane nilusuṁḍa nĕvvadĕnu nenu
(||vada||)
tanuvubaim̐ jĕyi vesi daggaram̐ bilisevu nī-
vanidalalona nĕvvadĕnu nenu
manasularasi veremāḍalagum̐ dīsevu
yĕnalega yiṁtadānigĕvvadĕnu nenu
(||vada||)
pachchigā navvevu nādom̐ baibai nī kŏluvugu
vachchina sadulalo nĕvvadĕnu nenu
machchiga naḍiṁchi nannu mābudām̐kām̐ bŏgaḍevu
hĕchchina savadulalo nĕvvadĕnu nenu
(||vada||)
saddigi vem̐ḍigi nādo sarasāle yāḍevu
vaddanuṁḍe vārilo nĕvvadĕnu nenu
kŏddido śhrīveṁkaḍeśha kūḍidivi nannu niṭṭe
yiddarame yĕkkuḍane vĕvvadĕrā nenu