Vachchu nada povu nada vaasi dappinaa

వచ్చు నట పోవు నట వాసి దప్పినా
Language

(॥పల్లవి॥)
వచ్చు నట పోవు నట వాసి దప్పినా
యెచ్చరించు టింతే కాక యిందరుఁ జూడఁగాను

(॥వచ్చునట॥)
పట్టిన చలమే కాక పంతము వే రొకటా
చిట్టికా లేమైనాఁ దానే సేసుఁ గాక
కుట్టి చడ దోసపిందా కోరి మన సెవ్వరికి
యెటె నా నాయఁ గాక యిఁక నేలే పనులు

(॥వచ్చునట॥)
ఆడినదే మాట గాక అప్పటి వే రొకటా
వోడక తా నేడనైనా నుండుఁ గాక
ఆడ నీడా గొల్లచల్లా అక్కునఁ బోసిచూడఁగ
జాడ దెలుసుట గాక సట లేలే యిఁకను

(॥వచ్చునుట॥)
కొన్నదే కోలు గాక కొంకు గొస రున్నదా
మున్నిటివలె నేనే మొక్కుట గాక
పన్నుగ శ్రీవేంకటాద్రిపతి నన్ను నిటు గూడె
అన్నమాట నాకు నెంచ నుచితమా యిఁకను

(||pallavi||)
vachchu naḍa povu naḍa vāsi dappinā
yĕchchariṁchu ṭiṁte kāga yiṁdarum̐ jūḍam̐gānu

(||vachchunaḍa||)
paṭṭina salame kāga paṁtamu ve rŏgaḍā
siṭṭigā lemainām̐ dāne sesum̐ gāga
kuṭṭi saḍa dosabiṁdā kori mana sĕvvarigi
yĕḍĕ nā nāyam̐ gāga yim̐ka nele panulu

(||vachchunaḍa||)
āḍinade māḍa gāga appaḍi ve rŏgaḍā
voḍaga tā neḍanainā nuṁḍum̐ gāga
āḍa nīḍā gŏllasallā akkunam̐ bosisūḍam̐ga
jāḍa dĕlusuḍa gāga saḍa lele yim̐kanu

(||vachchunuḍa||)
kŏnnade kolu gāga kŏṁku gŏsa runnadā
munniḍivalĕ nene mŏkkuḍa gāga
pannuga śhrīveṁkaḍādribadi nannu niḍu gūḍĕ
annamāḍa nāgu nĕṁcha nusidamā yim̐kanu