వచ్చి వచ్చి చెనకేవు వద్దన్నా మానవు
(॥పల్లవి॥)
వచ్చి వచ్చి చెనకేవు వద్దన్నా మానవు
యిచ్చకము నేరమే నీకింతేసి వలెనా
(॥వచ్చి॥)
ఆడేవి గొణఁగులు అమ్మేవి సణఁగులు
యీడనే మాపొందు నీకు నితవయ్యీనా
వాడుఁజూపే చూతుమూ వలలఁ బెట్టుదుమూ
వోడక మాతోడిపోరుకోపేవా నీవు
(॥వచ్చి॥)
సెలవినే నవ్వలూ చేఁతలెల్ల రవ్వలూ
పలుమారు మాచేతఁ బడఁగలవా
చలము సాదింతుమూ చనవు మెరతుమూ
వొలసి యీరాఁపులకు నొడిఁ గట్టఁగలవా
(॥వచ్చి॥)
కాఁగిటికి మెత్తుమూ కసరఁగఁ జొత్తుమూ
దాఁగక యీరతుల సందడికోపేవా
చేఁగదేరఁ గూడితివి శ్రీవేంకటేశుఁడ నన్ను
మాఁగిన మామోవితీపు మనసు వచ్చీనా
(||pallavi||)
vachchi vachchi sĕnagevu vaddannā mānavu
yichchagamu nerame nīgiṁtesi valĕnā
(||vachchi||)
āḍevi gŏṇam̐gulu ammevi saṇam̐gulu
yīḍane mābŏṁdu nīgu nidavayyīnā
vāḍum̐jūbe sūdumū valalam̐ bĕṭṭudumū
voḍaga mādoḍiborugobevā nīvu
(||vachchi||)
sĕlavine navvalū sem̐talĕlla ravvalū
palumāru māsedam̐ baḍam̐galavā
salamu sādiṁtumū sanavu mĕradumū
vŏlasi yīrām̐pulagu nŏḍim̐ gaṭṭam̐galavā
(||vachchi||)
kām̐giḍigi mĕttumū kasaram̐gam̐ jŏttumū
dām̐gaga yīradula saṁdaḍigobevā
sem̐gaderam̐ gūḍidivi śhrīveṁkaḍeśhum̐ḍa nannu
mām̐gina māmovidību manasu vachchīnā