Vachchi vachchi moodeem jochchi vaada vella nemidige

వచ్చి వచ్చి మూడీఁ జొచ్చి వాత వెళ్ల నేమిటికే
Language

(॥పల్లవి॥)
వచ్చి వచ్చి మూడీఁ జొచ్చి వాత వెళ్ల నేమిటికే
మచ్చిక నీతఁడు నన్ను మన్నించెఁ జూడఁగదె

(॥వచ్చి॥)
సంగడి నుండి పతికి చనవరి వైతివి
అంగము లంటి యంటి ఆలవైతివి
యెంగలి మోవి చూపి యితరివైతివి
అంగడి నీ దొరతనాలవి యేమి చెప్పేదే

(॥వచ్చి॥)
సుద్దులెల్లాఁ జెప్పుతానే చుట్టమవూ నైతివి
పెద్దగా నవ్వులు నవ్వి ప్రియమైతివి
బద్దులు మొక్కులు మొక్కి పాఁతదానవైతివి
చద్ది వేఁడినీ బీరాలు సారె నేమి చెప్పేదే

(॥వచ్చి॥)
వన్నెగా సేవలు సేసి వాడికకతైవైతివి
సన్నలు సేసిసేసి సతమతమైతివి
యిన్నిటి శ్రీవేంకటేశుఁ డేలె నన్నుఁ దొలుతనే
యెన్నిక నీ కాఁపురాలు యేమి చెప్పేదే

(||pallavi||)
vachchi vachchi mūḍīm̐ jŏchchi vāda vĕḽla nemiḍige
machchiga nīdam̐ḍu nannu manniṁchĕm̐ jūḍam̐gadĕ

(||vachchi||)
saṁgaḍi nuṁḍi padigi sanavari vaidivi
aṁgamu laṁṭi yaṁṭi ālavaidivi
yĕṁgali movi sūbi yidarivaidivi
aṁgaḍi nī dŏradanālavi yemi sĕppede

(||vachchi||)
suddulĕllām̐ jĕppudāne suṭṭamavū naidivi
pĕddagā navvulu navvi priyamaidivi
baddulu mŏkkulu mŏkki pām̐tadānavaidivi
saddi vem̐ḍinī bīrālu sārĕ nemi sĕppede

(||vachchi||)
vannĕgā sevalu sesi vāḍigagadaivaidivi
sannalu sesisesi sadamadamaidivi
yinniḍi śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nannum̐ dŏludane
yĕnniga nī kām̐purālu yemi sĕppede