Vachchevo raavo neevu vaadu lemtige

వచ్చేవో రావో నీవు వాదు లేఁటికే
Language

(॥పల్లవి॥)
వచ్చేవో రావో నీవు వాదు లేఁటికే
పచ్చిదేరె వలపులు పగటేలే ఇఁకను

(॥॥)
నగవు వెన్నెలగాసె నంటునఁ జన్నులు రాసె
యెగసక్కెములు నాతో నిఁకనేఁటికే
గుగురుగాఁ బులకించె కొప్పువిరు లటు చిందె
సొగసి బిగియ నీకుఁ జోటేదే యిఁకను

(॥॥)
మాటలఁ దేనెలు చిందె మనసులో నిండె
యీటు వెట్టి గుట్టుసేయ నిఁకనేఁటేకే
వూటురేఁగెఁ జెమటలు వుసురుసురులు రేఁగె
బూటకవుఁజల మింతే బొంకనేలే యిఁకను

(॥॥)
ఆయములు సరివచ్చె నాస లెల్లా గడు హెచ్చె
యేయెడఁ జూచినఁ బంతా లిఁకనేఁటికే
యీయెడ నే శ్రీ వేంకటేశుఁడఁ గూడితి నిన్ను
మాయదారితనముల మఱఁగేలే ఇఁకను

(||pallavi||)
vachchevo rāvo nīvu vādu lem̐ṭige
pachchiderĕ valabulu pagaḍele im̐kanu

(||||)
nagavu vĕnnĕlagāsĕ naṁṭunam̐ jannulu rāsĕ
yĕgasakkĕmulu nādo nim̐kanem̐ṭige
gugurugām̐ bulagiṁchĕ kŏppuviru laḍu siṁdĕ
sŏgasi bigiya nīgum̐ joḍede yim̐kanu

(||||)
māḍalam̐ denĕlu siṁdĕ manasulo niṁḍĕ
yīḍu vĕṭṭi guṭṭuseya nim̐kanem̐ṭege
vūḍurem̐gĕm̐ jĕmaḍalu vusurusurulu rem̐gĕ
būḍagavum̐jala miṁte bŏṁkanele yim̐kanu

(||||)
āyamulu sarivachchĕ nāsa lĕllā gaḍu hĕchchĕ
yeyĕḍam̐ jūsinam̐ baṁtā lim̐kanem̐ṭige
yīyĕḍa ne śhrī veṁkaḍeśhum̐ḍam̐ gūḍidi ninnu
māyadāridanamula maṟam̐gele im̐kanu