Vachche(sche)raa maa yammadodu vannelugaavu nee

వచ్చె(చ్చే)రా మా యమ్మతోడు వన్నెలుగావు నీ
Language

(॥పల్లవి॥)
వచ్చె(చ్చే)రా మా యమ్మతోడు వన్నెలుగావు నీ-
మచ్చరములెల్ల మాని మందకేఁగ నియ్యరా

(॥వచ్చె॥)
ఓసోసి యెందు వొయ్యేవే వొయ్యారపుగొల్లెతా
దోసము మమ్మునంటక తొలఁగరటు
మూసేవే గుబ్బలఁ గొంగు మురిపెంపుగొల్లెతా
మూసినది చీరకొంగు మందకేఁగ నియ్యారా

(॥వచ్చె॥)
సానఁ బట్టేవే మాటలే చల్లజంపు గొల్లెతా
నేనేమి బాఁతిరా నీకు నెరజాణా
కానిలే రావైతివిగా గబ్బిచూపుగొల్లెతా
మానమువంకఁ జూడక మందకేఁగ నియ్యరా

(॥వచ్చె॥)
జంకించేవే బొమ్మలను జవ్వనంపుగొల్లెతా
వేంకటవిభుఁడ నీకు వెరతుమయ్య
అంకపు గుబ్బలను నన్ను నదిమేవె గొల్లెతా
మంకుఁ గూటములు మాని మందకేఁగ నియ్యరా

(||pallavi||)
vachchĕ(sche)rā mā yammadoḍu vannĕlugāvu nī-
machcharamulĕlla māni maṁdagem̐ga niyyarā

(||vachchĕ||)
ososi yĕṁdu vŏyyeve vŏyyārabugŏllĕdā
dosamu mammunaṁṭaga tŏlam̐garaḍu
mūseve gubbalam̐ gŏṁgu muribĕṁpugŏllĕdā
mūsinadi sīragŏṁgu maṁdagem̐ga niyyārā

(||vachchĕ||)
sānam̐ baṭṭeve māḍale sallajaṁpu gŏllĕdā
nenemi bām̐tirā nīgu nĕrajāṇā
kānile rāvaidivigā gabbisūbugŏllĕdā
mānamuvaṁkam̐ jūḍaga maṁdagem̐ga niyyarā

(||vachchĕ||)
jaṁkiṁcheve bŏmmalanu javvanaṁpugŏllĕdā
veṁkaḍavibhum̐ḍa nīgu vĕradumayya
aṁkabu gubbalanu nannu nadimevĕ gŏllĕdā
maṁkum̐ gūḍamulu māni maṁdagem̐ga niyyarā