Vachchenani raagumduraa yeme neevu

వచ్చేనని రాకుందురా యేమే నీవు
Language

(॥పల్లవి॥)
వచ్చేనని రాకుందురా యేమే నీవు
అచ్చల మేమి గల్లాను అప్పుడే యాడరాదా

(॥వచ్చే॥)
యీడనుండే యింత సేతురా పూవుటింతి
వాడఁబెట్టి ముడిచితే వాసన గద్దా
వేడుకలు వెతసేతురా పతి
నాడ నెదురు చూపించినది పెద్దరికమా

(॥వచ్చే॥)
ఆసలనే యలయింతురా గాలి దెచ్చి
మూసిపట్టి తెరచితే మూల నుండునా
పాసి కూడి పగ లౌదురా యేమే యిఁక
వేసాలు మాని యాడకే విచ్చేయఁగదవే

(॥వచ్చే॥)
డగ్గరియుఁ దల వంతురా యీ నీరు
బుగ్గవంటిపాయ మిది పొల్లు సేతురా
కగ్గి శ్రీవేంకటవిభుఁడు నిన్నుఁగూడె
యెగ్గులెల్లా మఱచితి వెడమాట లేఁటికే

(||pallavi||)
vachchenani rāguṁdurā yeme nīvu
achchala memi gallānu appuḍe yāḍarādā

(||vachche||)
yīḍanuṁḍe yiṁta sedurā pūvuḍiṁti
vāḍam̐bĕṭṭi muḍiside vāsana gaddā
veḍugalu vĕdasedurā padi
nāḍa nĕduru sūbiṁchinadi pĕddarigamā

(||vachche||)
āsalane yalayiṁturā gāli dĕchchi
mūsibaṭṭi tĕraside mūla nuṁḍunā
pāsi kūḍi paga laudurā yeme yim̐ka
vesālu māni yāḍage vichcheyam̐gadave

(||vachche||)
ḍaggariyum̐ dala vaṁturā yī nīru
buggavaṁṭibāya midi pŏllu sedurā
kaggi śhrīveṁkaḍavibhum̐ḍu ninnum̐gūḍĕ
yĕggulĕllā maṟasidi vĕḍamāḍa lem̐ṭige