Vachche nadivo ramanumdu vaagidi koselulaala

వచ్చె నదివో రమణుఁడు వాకిటి కోచెలులాల
Language

(॥పల్లవి॥)
వచ్చె నదివో రమణుఁడు వాకిటి కోచెలులాల
పచ్చిదేర నొక్కమాటే పలుకరే యిపుడు

(॥వచ్చె॥)
వెలఁదికి వెలినున్న విభునిఁ దోడుకరాక
చెలు లేమిచెప్పినాను చెవిఁ బట్టవు
మలసి యాతనితోడ మాఁటలెల్లా నాడక
పలుపుపచారాలు పనిరావు

(॥వచ్చె॥)
చన్నులపై నాతనిమై సారె నప్పళించుకోక
సన్న లెంత సేనినాను సమ్మతిగాదు
కన్నుల నాతనిరూపు గక్కనఁ గనుఁగొనక
వున్నతి మీరాకలకు వుల్లము గరఁగదు

(॥వచ్చె॥)
తిరమై యాతనిమోవితేనె చవిచడక
సరుగ మీకానుకలు సంగతిగావు
యిరవై శ్రీవేంకటేశుఁ డితలోనె యీకెఁ గూడె
వెరగయ్యీ మీనేర్పులు వెలితిలేవు

(||pallavi||)
vachchĕ nadivo ramaṇum̐ḍu vāgiḍi kosĕlulāla
pachchidera nŏkkamāḍe palugare yibuḍu

(||vachchĕ||)
vĕlam̐digi vĕlinunna vibhunim̐ doḍugarāga
sĕlu lemisĕppinānu sĕvim̐ baṭṭavu
malasi yādanidoḍa mām̐ṭalĕllā nāḍaga
palububasārālu panirāvu

(||vachchĕ||)
sannulabai nādanimai sārĕ nappaḽiṁchugoga
sanna lĕṁta seninānu sammadigādu
kannula nādanirūbu gakkanam̐ ganum̐gŏnaga
vunnadi mīrāgalagu vullamu garam̐gadu

(||vachchĕ||)
tiramai yādanimovidenĕ savisaḍaga
saruga mīgānugalu saṁgadigāvu
yiravai śhrīveṁkaḍeśhum̐ ḍidalonĕ yīgĕm̐ gūḍĕ
vĕragayyī mīnerbulu vĕlidilevu