Vaavi lenidaananaa vaasidaana nimte kaaga

వావి లేనిదాననా వాసిదాన నింతే కాక
Language

(॥పల్లవి॥)
వావి లేనిదాననా వాసిదాన నింతే కాక
నీవు నేను నెఱిఁగిన నిజ మింతే కాకా

(॥వావి॥)
మాటిమాటికి నవ్వేవు మఱఁదలనా నేను
వాటపుఁ జుట్టరికపు వనిత నింతే
నాటించేవు కనుచూపు నాలితోడిదననా
యీటు నీపొరుగువార మింతే కాకా

(॥వావి॥)
సారె సారెఁ బిలిచేవు సరి నీమేనదాననా
వూరకె ముంగిట నుండే వువిదఁ గాక
గోరికొన దాఁకించేవు కోరి నీ యాఁకదాననా
గారవానఁ బేరటపుకాంత నింతే కాకా

(॥వావి॥)
పచ్చిగాఁ గౌఁగిలించేవు పట్టపుదేవులనా
తచ్చనకు మెలఁగేటితరుణిఁ గాక
యిచ్చకుఁడ శ్రీవేంకటేశ నన్ను నేలితివి
రచ్చకెక్కేదాననా నీ రతిదానఁ గాకా

(||pallavi||)
vāvi lenidānanā vāsidāna niṁte kāga
nīvu nenu nĕṟim̐gina nija miṁte kāgā

(||vāvi||)
māḍimāḍigi navvevu maṟam̐dalanā nenu
vāḍabum̐ juṭṭarigabu vanida niṁte
nāḍiṁchevu kanusūbu nālidoḍidananā
yīḍu nībŏruguvāra miṁte kāgā

(||vāvi||)
sārĕ sārĕm̐ bilisevu sari nīmenadānanā
vūragĕ muṁgiḍa nuṁḍe vuvidam̐ gāga
gorigŏna dām̐kiṁchevu kori nī yām̐kadānanā
gāravānam̐ beraḍabugāṁta niṁte kāgā

(||vāvi||)
pachchigām̐ gaum̐giliṁchevu paṭṭabudevulanā
tachchanagu mĕlam̐geḍidaruṇim̐ gāga
yichchagum̐ḍa śhrīveṁkaḍeśha nannu nelidivi
rachchagĕkkedānanā nī radidānam̐ gāgā