Vaasulu resulu vaddiganu

వాసులు రేసులు వద్దికను
Language

(॥పల్లవి॥)
వాసులు రేసులు వద్దికను
సేసలు చల్లుఁడు చెల్లును మీకు

(॥వాసు॥)
చనవునఁ బొరలీ సలిగెలఁ జెనకీ
ననుపునఁ గొసరీ నలినాక్షి
పెనఁగకు నీవిఁక పెంచకు చలములు
మనవి చేకొనుము మగఁడవు నీవు

(॥వాసు॥)
నగవున సొలసీ నంటునఁ బొదిగీ
తగవున నొరసీ తలోదరి
వెగటులు నెరపకు వింతలు సేయకు
బిగియకు చేకొను ప్రియుఁడవు నీవు

(॥వాసు॥)
ముచ్చటలాడీ ముద్దులు చిలికీ
మెచ్చీ నిను నలమేలుమంగ
ఇచ్చల శ్రీవేంకటేశ కూడితివి
మచ్చికఁ జెలఁగు రమణుఁడవు నీవు

(||pallavi||)
vāsulu resulu vaddiganu
sesalu sallum̐ḍu sĕllunu mīgu

(||vāsu||)
sanavunam̐ bŏralī saligĕlam̐ jĕnagī
nanubunam̐ gŏsarī nalinākṣhi
pĕnam̐gagu nīvim̐ka pĕṁchagu salamulu
manavi segŏnumu magam̐ḍavu nīvu

(||vāsu||)
nagavuna sŏlasī naṁṭunam̐ bŏdigī
tagavuna nŏrasī talodari
vĕgaḍulu nĕrabagu viṁtalu seyagu
bigiyagu segŏnu priyum̐ḍavu nīvu

(||vāsu||)
muchchaḍalāḍī muddulu siligī
mĕchchī ninu nalamelumaṁga
ichchala śhrīveṁkaḍeśha kūḍidivi
machchigam̐ jĕlam̐gu ramaṇum̐ḍavu nīvu