(॥పల్లవి॥)
వాసులకే బతికేటి వనితలము
సేసవెట్టి యేలితివి చేరి మన్నించవయ్యా
(॥వాసు॥)
కలికితనము లెల్లా కాంతలకు సాజము
మొలకనవ్వులు వన్నె మోములకును
వలపులకును బోది వాడికైన చేఁతలు
చెలఁగి మమ్మేల రట్టుసేయ వచ్చేవయ్యా
(॥వాసు॥)
వినయపు సరసాలు వేడుకలకు మూలము
చెనకులకుఁ దగులు చిరుసిగ్గులు
పెనఁగులాటకు లంకె ప్రియవాది తనములు
వొనరి మమ్మిఁకనేల వుప్పతించేవయ్యా
(॥వాసు॥)
కాఁగిటిరతిసన్నలు కనుబొమ్మ జంకెనలు
మాఁగిన మోవియీగులు మతి చొక్కులు
చేఁగ దేరఁ గూడితివి శ్రీవేంకటేశుఁడ నన్ను
తోఁగి చూచి యేల మాసుద్దులు మెచ్చేవయ్యా
(||pallavi||)
vāsulage badigeḍi vanidalamu
sesavĕṭṭi yelidivi seri manniṁchavayyā
(||vāsu||)
kaligidanamu lĕllā kāṁtalagu sājamu
mŏlaganavvulu vannĕ momulagunu
valabulagunu bodi vāḍigaina sem̐talu
sĕlam̐gi mammela raṭṭuseya vachchevayyā
(||vāsu||)
vinayabu sarasālu veḍugalagu mūlamu
sĕnagulagum̐ dagulu sirusiggulu
pĕnam̐gulāḍagu laṁkĕ priyavādi tanamulu
vŏnari mammim̐kanela vuppadiṁchevayyā
(||vāsu||)
kām̐giḍiradisannalu kanubŏmma jaṁkĕnalu
mām̐gina moviyīgulu madi sŏkkulu
sem̐ga deram̐ gūḍidivi śhrīveṁkaḍeśhum̐ḍa nannu
tom̐gi sūsi yela māsuddulu mĕchchevayyā