వాసియు వన్నెయుఁగల వనిత నేను నీవు
(॥పల్లవి॥)
వాసియు వన్నెయుఁగల వనిత నేను నీవు
వేసర వెందురునైనా వెరతు నే నిందుకు
(॥వాసి॥)
వొద్దువొద్దు వాదులేల వుమ్మడినే వుండనీరా
కొద్దిమీరి బడలించుకొననేంటికి
కద్దు నీకు నలవాటు కడు శిశుపాలునిచే
నద్దలింపులఁ బడితి వంతకు నే నోపను
(॥వాసి॥)
పట్టఁబట్టకురా నిన్ను బలిమి నంతేసి నేఁడు
గుట్టున నుండరా నీవు గొంత యేఁచక
యిట్టునట్టు వెన్నలకు నిండ్లిండ్లెల్లా దూరి
కట్టువడితి రోలఁ గలమా నే మెందును
(॥వాసి॥)
పోకుపోకు మంత నీవు పొందితి శ్రీవేంకటేశ
చేకొని పెదమనసుచేతవాఁడవు
కాకరివై యనసూయ కడరుబాలుఁడవైతి
నీకు నిది మెచ్చుగాక నెరి మాకుఁ దగునా
(||pallavi||)
vāsiyu vannĕyum̐gala vanida nenu nīvu
vesara vĕṁdurunainā vĕradu ne niṁdugu
(||vāsi||)
vŏdduvŏddu vādulela vummaḍine vuṁḍanīrā
kŏddimīri baḍaliṁchugŏnaneṁṭigi
kaddu nīgu nalavāḍu kaḍu śhiśhubālunise
naddaliṁpulam̐ baḍidi vaṁtagu ne nobanu
(||vāsi||)
paṭṭam̐baṭṭagurā ninnu balimi naṁtesi nem̐ḍu
guṭṭuna nuṁḍarā nīvu gŏṁta yem̐saga
yiṭṭunaṭṭu vĕnnalagu niṁḍliṁḍlĕllā dūri
kaṭṭuvaḍidi rolam̐ galamā ne mĕṁdunu
(||vāsi||)
pogubogu maṁta nīvu pŏṁdidi śhrīveṁkaḍeśha
segŏni pĕdamanasusedavām̐ḍavu
kāgarivai yanasūya kaḍarubālum̐ḍavaidi
nīgu nidi mĕchchugāga nĕri māgum̐ dagunā