Vaasigi badugudimte vanidalayinavaaru

వాసికి బతుకుటింతే వనితలయినవారు
Language

(॥పల్లవి॥)
వాసికి బతుకుటింతే వనితలయినవారు
పాసిన కూటికంటే పస్తైనా మేలురా

(॥వాసి॥)
రాకుండేవాఁడవా రాతిరెల్ల మాయింటికి
ఆకడ నీ కెవ్వతో పై యాడెఁగాక
నీకు నీగుణము లేదు నేఁడిన్నాళ్లదాఁకా
కాకునఁ బడుటకంటే కడనుంటే మేలురా

(॥వాసి॥)
కోపగించేవాఁడవా కొసరి నే నేమన్నా
నీపావ మెవ్వతొ! నీకు నేరిపెఁగాక
యేపున మారుమాటాడ వెన్నఁడు నేఁడలిగేవు
తీపులలోఁన జేఁదైతే తెగువలే మేలురా

(॥వాసి॥)
తలవంచేవాడవా దగ్గరి కాఁగిలించితే
కులుకి యెవ్వతో బాసగొన్నదిగాక
బలిమి శ్రీవేంకటేశ పై కొని నిన్నుఁ గూడితి
కలకాలమును నిన్నుఁ గాచుకున్న మేలురా

(||pallavi||)
vāsigi baduguḍiṁte vanidalayinavāru
pāsina kūḍigaṁṭe pastainā melurā

(||vāsi||)
rāguṁḍevām̐ḍavā rādirĕlla māyiṁṭigi
āgaḍa nī kĕvvado pai yāḍĕm̐gāga
nīgu nīguṇamu ledu nem̐ḍinnāḽladām̐kā
kāgunam̐ baḍuḍagaṁṭe kaḍanuṁṭe melurā

(||vāsi||)
kobagiṁchevām̐ḍavā kŏsari ne nemannā
nībāva mĕvvadŏ! nīgu neribĕm̐gāga
yebuna mārumāḍāḍa vĕnnam̐ḍu nem̐ḍaligevu
tībulalom̐na jem̐daide tĕguvale melurā

(||vāsi||)
talavaṁchevāḍavā daggari kām̐giliṁchide
kulugi yĕvvado bāsagŏnnadigāga
balimi śhrīveṁkaḍeśha pai kŏni ninnum̐ gūḍidi
kalagālamunu ninnum̐ gāsugunna melurā