వాసికే బతికేవారు వనితలెల్లా
(॥పల్లవి॥)
వాసికే బతికేవారు వనితలెల్లా
గోస(సున?) నాససేతురా కొండవంటి దొరవు
(॥॥)
చెలి నీమాటలువిని సిగ్గులువడీ నదే
పలుమారు నింతయేల పచ్చిసేసేవు
యెలమి యేకతమైతే నేమిసేసినాఁ జెల్లు
కొలువులో నింతగద్దా కొండవంటి దొరవు
(॥॥)
భామిని నీసేఁతులకు పయ్యద మూసుకొనీని
వేమారు నింతేల వెల్లవిరి సేసేవు
దోమతెరలోన నెంత తుదమీరినాఁ జెల్లు
కోమల మెఱుగఁవద్దా కొండవంటిదొరవు
(॥॥)
కొమ్మ నీనవ్వులకు గొబ్బునఁ దలవంచీని
కమ్మర నింతేల తమకము రేఁచేవు
యిమ్ముల శ్రీవేంకటేశ యిద్దరికూటమీఁ జెల్లు
కుమ్మరింతురా వేసాలు కొండవంటి దొరవు
(||pallavi||)
vāsige badigevāru vanidalĕllā
gosa(suna?) nāsasedurā kŏṁḍavaṁṭi dŏravu
(||||)
sĕli nīmāḍaluvini sigguluvaḍī nade
palumāru niṁtayela pachchisesevu
yĕlami yegadamaide nemisesinām̐ jĕllu
kŏluvulo niṁtagaddā kŏṁḍavaṁṭi dŏravu
(||||)
bhāmini nīsem̐tulagu payyada mūsugŏnīni
vemāru niṁtela vĕllaviri sesevu
domadĕralona nĕṁta tudamīrinām̐ jĕllu
komala mĕṟugam̐vaddā kŏṁḍavaṁṭidŏravu
(||||)
kŏmma nīnavvulagu gŏbbunam̐ dalavaṁchīni
kammara niṁtela tamagamu rem̐sevu
yimmula śhrīveṁkaḍeśha yiddarigūḍamīm̐ jĕllu
kummariṁturā vesālu kŏṁḍavaṁṭi dŏravu