వాసితో నుండుటే మేలు వనితకు
(॥పల్లవి॥)
వాసితో నుండుటే మేలు వనితకు
పూస గుచ్చినట్టు తన్నుఁ బొగడేదే మంచిది
(॥॥)
చెప్పరాని మాటలు చెవి యొగ్గి విననేల
తిప్పరాని మనసుతో దీకొననేల
తప్పక యెట్టుండినాను తనదాననే నేను
చిప్పిలఁ దనకొలువు సేసేదే చాలునే
(॥॥)
అందరాని వీడేల కటు చేయి చాఁచనేల
పొందు గాని రతులకుఁ బొదుగ నేల
సందడి యంతైనాను చనవరిదాన నేను
చెంది తనపూడిగాలు సేయుటే లాభమే
(॥॥)
కూడరాని కౌఁగిటను కుచముల నొత్త నేల
వీడరాని చెలుములు విడువనేల
యీడనే శ్రీ వేంకటేశుఁడింతలోనె నన్నునేలె
జోడు గూడి తనమోము చూచేదే నేరుపే
(||pallavi||)
vāsido nuṁḍuḍe melu vanidagu
pūsa guchchinaṭṭu tannum̐ bŏgaḍede maṁchidi
(||||)
sĕpparāni māḍalu sĕvi yŏggi vinanela
tipparāni manasudo dīgŏnanela
tappaga yĕṭṭuṁḍinānu tanadānane nenu
sippilam̐ danagŏluvu sesede sālune
(||||)
aṁdarāni vīḍela kaḍu seyi sām̐sanela
pŏṁdu gāni radulagum̐ bŏduga nela
saṁdaḍi yaṁtainānu sanavaridāna nenu
sĕṁdi tanabūḍigālu seyuḍe lābhame
(||||)
kūḍarāni kaum̐giḍanu kusamula nŏtta nela
vīḍarāni sĕlumulu viḍuvanela
yīḍane śhrī veṁkaḍeśhum̐ḍiṁtalonĕ nannunelĕ
joḍu gūḍi tanamomu sūsede nerube