Vaasido bradigeyatti vanida nenu

వాసితో బ్రదికేయట్టి వనిత నేను
Language

(॥పల్లవి॥)
వాసితో బ్రదికేయట్టి వనిత నేను
సేసవెట్టినవాఁడవు వేసినట్టు సేయరా

(॥వాసి॥)
సాటివెట్టవద్దు గానిసతులతోడుత నన్ను
పాటించి నీతొత్తుఁజేసిపనిగొనరా
మాటలకోరువఁగాని మనసులోఁగలట్టెల్ల
చీటికిమాటికి నీవు చేఁతలెల్లఁ జేయరా

(॥వాసి॥)
వంకలాడవద్దుగాని వంతులసతులలోన
కొంకులేక నీపాదాన కోరి చిమ్మరా
బొంకులకు నోపఁగాని పొరుగిరుగులు మెచ్చ
సంకేలేక నీయిచ్చల సాదించరా

(॥వాసి॥)
మేకుసేయవద్దు గానిమెలుఁతలయెదుటను
పైకొని నీబలిమెల్ల పచరించరా
యీకడ శ్రీవేంకటేశ యెనసితి విట్టె నన్ను
చీకాకులకుఁ జాల చేకొని మన్నించరా

(||pallavi||)
vāsido bradigeyaṭṭi vanida nenu
sesavĕṭṭinavām̐ḍavu vesinaṭṭu seyarā

(||vāsi||)
sāḍivĕṭṭavaddu gānisaduladoḍuda nannu
pāḍiṁchi nīdŏttum̐jesibanigŏnarā
māḍalagoruvam̐gāni manasulom̐galaṭṭĕlla
sīḍigimāḍigi nīvu sem̐talĕllam̐ jeyarā

(||vāsi||)
vaṁkalāḍavaddugāni vaṁtulasadulalona
kŏṁkulega nībādāna kori simmarā
bŏṁkulagu nobam̐gāni pŏrugirugulu mĕchcha
saṁkelega nīyichchala sādiṁcharā

(||vāsi||)
meguseyavaddu gānimĕlum̐talayĕduḍanu
paigŏni nībalimĕlla pasariṁcharā
yīgaḍa śhrīveṁkaḍeśha yĕnasidi viṭṭĕ nannu
sīgāgulagum̐ jāla segŏni manniṁcharā