Vaaru seppinattu sesevaari vaaramu

వారు చెప్పినట్టు సేసేవారి వారము
Language

(॥పల్లవి॥)
వారు చెప్పినట్టు సేసేవారి వారము
యీరీతి పనుల కప్పణిప్పించుమా నాకును

(॥వారు॥)
కోరేటి యాఁడు వారము కోపాల కెల్లా మొదలు
యేరా నీతోడి పొందు కేమి బాఁతి
చేరి మమ్ముఁ జెనకేవు చేయి మేము చాఁచితేను
దూరు రాదా నీతొంటి తొయ్యలులచేతను

(॥వారు॥)
పంతపు మాటవారము పట్టినందుకెల్లా గురి
ఇంతటివారి మెప్పించ నెఱుఁగుదుమా
మంతనము లాడేము మరుచుమాటాడితేను
సంతసించేరా నీ సవతు లిందరును

(॥వారు॥)
వేడుకవేళ దానను వేవేలు రతుల పోగు
కూడితి శ్రీ వేంకటేశ గుట్టెరిఁగేనా
వూడిగేలకు మెచ్చేవు వొద్దనే నీదేవియని
తోడ నాపెసమ్మతే యింతు లెల్లా నవ్వేరు

(||pallavi||)
vāru sĕppinaṭṭu sesevāri vāramu
yīrīdi panula kappaṇippiṁchumā nāgunu

(||vāru||)
koreḍi yām̐ḍu vāramu kobāla kĕllā mŏdalu
yerā nīdoḍi pŏṁdu kemi bām̐ti
seri mammum̐ jĕnagevu seyi memu sām̐sidenu
dūru rādā nīdŏṁṭi tŏyyalulasedanu

(||vāru||)
paṁtabu māḍavāramu paṭṭinaṁdugĕllā guri
iṁtaḍivāri mĕppiṁcha nĕṟum̐gudumā
maṁtanamu lāḍemu marusumāḍāḍidenu
saṁtasiṁcherā nī savadu liṁdarunu

(||vāru||)
veḍugaveḽa dānanu vevelu radula pogu
kūḍidi śhrī veṁkaḍeśha guṭṭĕrim̐genā
vūḍigelagu mĕchchevu vŏddane nīdeviyani
toḍa nābĕsammade yiṁtu lĕllā navveru