వారివారి వోజ లింతే వద్దన నేలే
(॥పల్లవి॥)
వారివారి వోజ లింతే వద్దన నేలే
తేరకత్తెలతో నెల్లా దీకొనఁగ నేఁటికే
(॥వారి॥)
పలుచుఁ దనమువారు పెనఁగులాడఁ జూతురు
బలిమి గలుగువారు నచారింతురు
చలపాదివారైతే సాదించ వత్తురు
వలపు గలితేఁ జాలు వాసు లెంచ నేఁటికే
(॥వారి॥)
వేసరినవారు కడు వెరగువడి వుందురు
దోస మెరఁగనివారు దూరుదురు
యీసున నుండేవారు యెగ్గులెల్లాఁ బట్టుదురు
సేస వెట్టిన వెనక సిగ్గువడ నేఁటికే
(॥వారి॥)
సరస మాడేవారు చనవులు మెరతురు
మరిగినవారు మర్మ మంటుదురు
యిరవై శ్రీవేంకటేశుఁ డిదె నన్నుఁ గూడినాఁడు
దొరసెఁ బనులు సవతుల గొడ వేఁటికే
(||pallavi||)
vārivāri voja liṁte vaddana nele
teragattĕlado nĕllā dīgŏnam̐ga nem̐ṭige
(||vāri||)
palusum̐ danamuvāru pĕnam̐gulāḍam̐ jūduru
balimi galuguvāru nasāriṁturu
salabādivāraide sādiṁcha vatturu
valabu galidem̐ jālu vāsu lĕṁcha nem̐ṭige
(||vāri||)
vesarinavāru kaḍu vĕraguvaḍi vuṁduru
dosa mĕram̐ganivāru dūruduru
yīsuna nuṁḍevāru yĕggulĕllām̐ baṭṭuduru
sesa vĕṭṭina vĕnaga sigguvaḍa nem̐ṭige
(||vāri||)
sarasa māḍevāru sanavulu mĕraduru
mariginavāru marma maṁṭuduru
yiravai śhrīveṁkaḍeśhum̐ ḍidĕ nannum̐ gūḍinām̐ḍu
dŏrasĕm̐ banulu savadula gŏḍa vem̐ṭige