Vaari batti iyyagonavalemgaaga

వారి బత్తి ఇయ్యకొనవలెఁగాక
Language

(॥పల్లవి॥)
వారి బత్తి ఇయ్యకొనవలెఁగాక
యేరీతినైనా మేలే యేమి సేయవచ్చును

(॥వారి॥)
యెలమి నీ వాడానీడా నెందరిఁ బెండ్లాడినాను
చలమరిదాననా సాదించ నేను
కలరు నీకుఁ జుట్టాలు కామినులు యెందరైనా
యెలయింతు రందుకు నీ కేమిసేయవచ్చును

(॥వారి॥)
బెరసి యెవ్వతె వెంటఁబెట్టుక నీవు దెచ్చినా
విరసపుదాననా వెంగేలాడను
సరవు లెఱుఁగుదు నా జాడలన్నియు వింటి
ఇరుమేలా నుండేముగా కేమి సేయవచ్చును

(॥వారి॥)
ఇంతలో నాముందర మీరిద్దనునుఁ గూడినాను
వింతయైనదాననా విడనాడను
ఇంతట శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
యెంతలేదు నీయాసోద మేమిసేయవచ్చును

(||pallavi||)
vāri batti iyyagŏnavalĕm̐gāga
yerīdinainā mele yemi seyavachchunu

(||vāri||)
yĕlami nī vāḍānīḍā nĕṁdarim̐ bĕṁḍlāḍinānu
salamaridānanā sādiṁcha nenu
kalaru nīgum̐ juṭṭālu kāminulu yĕṁdarainā
yĕlayiṁtu raṁdugu nī kemiseyavachchunu

(||vāri||)
bĕrasi yĕvvadĕ vĕṁṭam̐bĕṭṭuga nīvu dĕchchinā
virasabudānanā vĕṁgelāḍanu
saravu lĕṟum̐gudu nā jāḍalanniyu viṁṭi
irumelā nuṁḍemugā kemi seyavachchunu

(||vāri||)
iṁtalo nāmuṁdara mīriddanunum̐ gūḍinānu
viṁtayainadānanā viḍanāḍanu
iṁtaḍa śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
yĕṁtaledu nīyāsoda memiseyavachchunu