Vaaremi seduru vanidalimte

వారేమి సేతురు వనితలింతే
Language

(॥పల్లవి॥)
వారేమి సేతురు వనితలింతే
దూరకువే నీవు తొయ్యలుల

(॥వారే॥)
చెలుల నాడకువే సేవ సేసేవారు
బలిమిఁ బట్టఁగఁ బాయుదురా
తలపోసి మేలు తానెఱఁగవలె
చెలువునివే యీ చేఁతలెల్లా

(॥వారే॥)
కోపగించకువే కొలువులోవారు
వోపమందురా వొరయఁగా
దాపైన విభుఁడు తానెంచుకోవలె
చూపి చెప్పవే సుద్దులెల్లా

(॥వారే॥)
యేమీ ననకువే యేలుకొన్నవారు
కామించినవేళఁ గాదందురా
యీమేర శ్రీవేంకటేశుఁడే నన్నేలె
నే మానననవే నేర్పులెల్లా

(||pallavi||)
vāremi seduru vanidaliṁte
dūraguve nīvu tŏyyalula

(||vāre||)
sĕlula nāḍaguve seva sesevāru
balimim̐ baṭṭam̐gam̐ bāyudurā
talabosi melu tānĕṟam̐gavalĕ
sĕluvunive yī sem̐talĕllā

(||vāre||)
kobagiṁchaguve kŏluvulovāru
vobamaṁdurā vŏrayam̐gā
dābaina vibhum̐ḍu tānĕṁchugovalĕ
sūbi sĕppave suddulĕllā

(||vāre||)
yemī nanaguve yelugŏnnavāru
kāmiṁchinaveḽam̐ gādaṁdurā
yīmera śhrīveṁkaḍeśhum̐ḍe nannelĕ
ne mānananave nerbulĕllā