వారీఁ జూచె దాని వలుపే చూచుట గాక
(॥పల్లవి॥)
వారీఁ జూచె దాని వలుపే చూచుట గాక
సారె నీకిచ్చక మౌటే సంతోసము నాకూ
(॥॥)
కడఁగి నీ సతు లెంత గర్వముతో నుండినాను
అడియాలమగు మాట లాడింతు నేనూ
వుడివోని నీ మన్నన నుల్లసము లాడినాను
యెడనెడ నందుకుఁగా నెగ్గుపట్ట నేనూ
(॥॥)
కసరి సవతులు మొగాలు ముడుచుకొన్నాను
ముసిమి చెప్పి నవ్వించి మొక్కుదునేను
వసగాని కాంతాళాల వాదుకు వచ్చినాను
పొసఁగి చుట్టరికానఁ దొందు సేతు నేనూ
(॥॥)
పక్కన నీ దేవుళ్ళెంత పంతాలు మెఱసినాను
మిక్కిలిఁ బొగడుతాను మెచ్చి చెల్లింతు
మక్కువతో నలమేలుమంగ శ్రీ వేంకటేశ్వర
యిక్కడ నన్నేలితివి యిందరిదాన నేనూ
(||pallavi||)
vārīm̐ jūsĕ dāni valube sūsuḍa gāga
sārĕ nīgichchaga mauḍe saṁtosamu nāgū
(||||)
kaḍam̐gi nī sadu lĕṁta garvamudo nuṁḍinānu
aḍiyālamagu māḍa lāḍiṁtu nenū
vuḍivoni nī mannana nullasamu lāḍinānu
yĕḍanĕḍa naṁdugum̐gā nĕggubaṭṭa nenū
(||||)
kasari savadulu mŏgālu muḍusugŏnnānu
musimi sĕppi navviṁchi mŏkkudunenu
vasagāni kāṁtāḽāla vādugu vachchinānu
pŏsam̐gi suṭṭarigānam̐ dŏṁdu sedu nenū
(||||)
pakkana nī devuḽḽĕṁta paṁtālu mĕṟasinānu
mikkilim̐ bŏgaḍudānu mĕchchi sĕlliṁtu
makkuvado nalamelumaṁga śhrī veṁkaḍeśhvara
yikkaḍa nannelidivi yiṁdaridāna nenū