Vaanivaani svabhaavamu vaddanaraadu

వానివాని స్వభావము వద్దనరాదు
Language

(॥పల్లవి॥)
వానివాని స్వభావము వద్దనరాదు
తానందుఁ దొరల నంటే తప్పులు లేవు

(॥వాని॥)
సొరిది చింతపులుసు చూచితే నోరూరును
వరుసలం జవిగొన్నవాఁడు గాఁడు
పరగ దేహప్రకృతి పదార్థగుణము లవి
తొరల కెఱుఁగుకొంటె దోషము లేదు

(॥వాని॥)
నెలకొన్న యింతుల వర్ణించితె బుద్ధి చలించు
వలసి యంటి ముట్టిన వాఁడు గాఁడు
తలఁపు లక్ష్యము గుఱి దాఁకిన భావము లవి
తలఁకక తెలిసితే తగు లేమి లేదు

(॥వాని॥)
రీతితో సర్పమును మంత్రించితే కరవదు
వాత సూత్రము గట్టినవాఁడు గాఁడు
యీతల శ్రీవేంకటాద్రి యీశ్వరు మహిమ లివి
యేతులఁ గొలిచితేను యేకర్మము లేదు

(||pallavi||)
vānivāni svabhāvamu vaddanarādu
tānaṁdum̐ dŏrala naṁṭe tappulu levu

(||vāni||)
sŏridi siṁtabulusu sūside norūrunu
varusalaṁ javigŏnnavām̐ḍu gām̐ḍu
paraga dehaprakṛti padārdhaguṇamu lavi
tŏrala kĕṟum̐gugŏṁṭĕ doṣhamu ledu

(||vāni||)
nĕlagŏnna yiṁtula varṇiṁchidĕ buddhi saliṁchu
valasi yaṁṭi muṭṭina vām̐ḍu gām̐ḍu
talam̐pu lakṣhyamu guṟi dām̐kina bhāvamu lavi
talam̐kaga tĕliside tagu lemi ledu

(||vāni||)
rīdido sarbamunu maṁtriṁchide karavadu
vāda sūtramu gaṭṭinavām̐ḍu gām̐ḍu
yīdala śhrīveṁkaḍādri yīśhvaru mahima livi
yedulam̐ gŏlisidenu yegarmamu ledu