(॥పల్లవి॥)
వాన గురియక తొల్లె వరదలేల
నానఁబెట్టి కొంతగొంత నంటునేయరాదా
(॥॥)
మనసులో నేమిగల్లా మాపటంతఁ జేతుగాక
చెనకి నవ్వు నవ్వితేఁ జెల్లదనేవా
అనువై పంతముగొనేయప్పుడే కొనేవుగాక
మనికిగా నందాఁకా మాటలాడరాదా
(॥॥)
వేడుక నేమేనికాఁక వెనకఁ జెప్పేవుగాక
వీడె మందుకొన్నంతనే వెలితయ్యీనా
కూడినరతులవేళఁ గొసరే వింతేకాక
పాడితో మంచముమీఁదఁ బవ్వళించరాదా
(॥॥)
తారుకాణించినప్పుడు తలవంచుకొందు గాని
చేరి నీవు కాఁగిలించితే దోసమా
మేరతో శ్రీ వేంకటేశ మెచ్చి నన్నుఁ గూడితివి
కారణములేని సిగ్గు కట్టిపెట్టరాదా
(||pallavi||)
vāna guriyaga tŏllĕ varadalela
nānam̐bĕṭṭi kŏṁtagŏṁta naṁṭuneyarādā
(||||)
manasulo nemigallā mābaḍaṁtam̐ jedugāga
sĕnagi navvu navvidem̐ jĕlladanevā
anuvai paṁtamugŏneyappuḍe kŏnevugāga
manigigā naṁdām̐kā māḍalāḍarādā
(||||)
veḍuga nemenigām̐ka vĕnagam̐ jĕppevugāga
vīḍĕ maṁdugŏnnaṁtane vĕlidayyīnā
kūḍinaradulaveḽam̐ gŏsare viṁtegāga
pāḍido maṁchamumīm̐dam̐ bavvaḽiṁcharādā
(||||)
tārugāṇiṁchinappuḍu talavaṁchugŏṁdu gāni
seri nīvu kām̐giliṁchide dosamā
merado śhrī veṁkaḍeśha mĕchchi nannum̐ gūḍidivi
kāraṇamuleni siggu kaṭṭibĕṭṭarādā