Vaamduvo nee ramanumdu varusagu vachchinaamdu

వాఁడువో నీ రమణుఁడు వరుసకు వచ్చినాఁడు
Language

(॥పల్లవి॥)
వాఁడువో నీ రమణుఁడు వరుసకు వచ్చినాఁడు
పోడిమితోఁ గాఁపురాలు పొందుగాఁ జేయఁగదె

(॥వాఁడు॥)
చెలిమి చెమటలు నిండు సేయఁగఁ జేయఁగాను
కలిమి గంపల కెక్కు కైకొంటేను
బలిమి బండ్ల వచ్చు పలుమారుఁ బెనఁగితే
నిలువు నూరువండీని నేకేలే చింతా

(॥వాఁడు॥)
వేడుక వెల్లివిరుసు వినోదాలు జరపితే
వాడికలు గుంపుగట్టు వలెనంటేను
కూడిక రతికి నెక్కు కొంకక చెనకితేను
యీడు జోళ్లొక్కటాయ ఇఁకనేలే చింతా

(॥వాఁడు॥)
ఆసలు పైపైఁ బెరుగు నంగములు సోఁకితేను
బాసలెల్లా నెట్టుకొను బత్తి గలితే
సేసవెట్టి కూడినాఁడు శ్రీవేంకటేశుఁడు నిన్ను
తాసువలె మీరున్నారు తగదేలే చింతా

(||pallavi||)
vām̐ḍuvo nī ramaṇum̐ḍu varusagu vachchinām̐ḍu
poḍimidom̐ gām̐purālu pŏṁdugām̐ jeyam̐gadĕ

(||vām̐ḍu||)
sĕlimi sĕmaḍalu niṁḍu seyam̐gam̐ jeyam̐gānu
kalimi gaṁpala kĕkku kaigŏṁṭenu
balimi baṁḍla vachchu palumārum̐ bĕnam̐gide
niluvu nūruvaṁḍīni negele siṁtā

(||vām̐ḍu||)
veḍuga vĕllivirusu vinodālu jarabide
vāḍigalu guṁpugaṭṭu valĕnaṁṭenu
kūḍiga radigi nĕkku kŏṁkaga sĕnagidenu
yīḍu joḽlŏkkaḍāya im̐kanele siṁtā

(||vām̐ḍu||)
āsalu paibaim̐ bĕrugu naṁgamulu som̐kidenu
bāsalĕllā nĕṭṭugŏnu batti galide
sesavĕṭṭi kūḍinām̐ḍu śhrīveṁkaḍeśhum̐ḍu ninnu
tāsuvalĕ mīrunnāru tagadele siṁtā