Vaamdu gade prahlaadavaradumdu

వాఁడు గదె ప్రహ్లాదవరదుఁడు
Language

(॥పల్లవి॥)
వాఁడు గదె ప్రహ్లాదవరదుఁడు
నాఁడాడిన మాటలకు నవ్వీని చూడరే

(॥వాఁడు॥)
పంతములెల్లాఁ జెల్లించె ప్రహ్లాదవరదుఁడు
వంతుక్కించెఁ బ్రహ్లాదవరదుఁడు
బంతి విడేలు పెట్టెను ప్రహ్లాదవరదుఁడు
ఇంతటి నారమణుని నేమని చెప్పుదునే

(॥వాఁడు॥)
బలిమిఁ జన్ను లంటె నీ ప్రహ్లాదవరదుఁడు
వలపు నించెఁ బ్రహ్లాదవరదుఁడు
పలుకుఁబంత మీడేర్చెఁ బ్రహ్లాదవరదుఁడు
అలరించె నిన్నిటా నేమని పొగడుదునే

(॥వాఁడు॥)
పన్నుగ శ్రీవేంకటాద్రి ప్రహ్లాదవరదుఁడు
వన్నెగాఁ గూడెఁ బ్రహ్లాదవరదుఁడు
పన్నినమాయ దెలిపె ప్రహ్లాదవరదుఁడు
యిన్నిటా నీతనిసుద్దు లెన్నెని నే మెత్తునే

(||pallavi||)
vām̐ḍu gadĕ prahlādavaradum̐ḍu
nām̐ḍāḍina māḍalagu navvīni sūḍare

(||vām̐ḍu||)
paṁtamulĕllām̐ jĕlliṁchĕ prahlādavaradum̐ḍu
vaṁtukkiṁchĕm̐ brahlādavaradum̐ḍu
baṁti viḍelu pĕṭṭĕnu prahlādavaradum̐ḍu
iṁtaḍi nāramaṇuni nemani sĕppudune

(||vām̐ḍu||)
balimim̐ jannu laṁṭĕ nī prahlādavaradum̐ḍu
valabu niṁchĕm̐ brahlādavaradum̐ḍu
palugum̐baṁta mīḍersĕm̐ brahlādavaradum̐ḍu
alariṁchĕ ninniḍā nemani pŏgaḍudune

(||vām̐ḍu||)
pannuga śhrīveṁkaḍādri prahlādavaradum̐ḍu
vannĕgām̐ gūḍĕm̐ brahlādavaradum̐ḍu
panninamāya dĕlibĕ prahlādavaradum̐ḍu
yinniḍā nīdanisuddu lĕnnĕni ne mĕttune