Vaamdivo nee ramanumdu vachchivunnaamdu

వాఁడివో నీ రమణుఁడు వచ్చివున్నాఁడు
Language

(॥పల్లవి॥)
వాఁడివో నీ రమణుఁడు వచ్చివున్నాఁడు
వేఁడుకొని వినయాలు వేవేలుఁ జేయవే

(॥వాఁడి॥)
మంచిమాట లాడితేనే మనుసులు గరఁగును
వంచనతో మొక్కితేనే వాడికి వుట్టు
ముంచి కాఁగిలించితేనే మొగమోట సతమౌను
యెంచి రమణునికి నీవిచ్చకమే సేయవే

(॥వాఁడి॥)
కన్నులఁ జూచితేనే కలయఁగ బుద్దియౌను
సన్నలు సేసితేనే సమ్మతులౌను
చిన్ని నవ్వు నవ్వితేనే చిప్పిలుఁ దమకములు
ఇన్నిటాఁ బతికి నీవు ఇంపులే రేఁచవే

(॥వాఁడి॥)
కైవసమై యుండితే కడఁగు జుట్టరికము
చేవదేరఁ బెనఁగితే చేఁత లీడేరు
యీవేళ నలమేల్మంగ విన్నిటాను నిన్నునేలె
శ్రీవేంకటేశుఁ డితఁడు సేవలెల్లాఁ జేయవే

(||pallavi||)
vām̐ḍivo nī ramaṇum̐ḍu vachchivunnām̐ḍu
vem̐ḍugŏni vinayālu vevelum̐ jeyave

(||vām̐ḍi||)
maṁchimāḍa lāḍidene manusulu garam̐gunu
vaṁchanado mŏkkidene vāḍigi vuṭṭu
muṁchi kām̐giliṁchidene mŏgamoḍa sadamaunu
yĕṁchi ramaṇunigi nīvichchagame seyave

(||vām̐ḍi||)
kannulam̐ jūsidene kalayam̐ga buddiyaunu
sannalu sesidene sammadulaunu
sinni navvu navvidene sippilum̐ damagamulu
inniḍām̐ badigi nīvu iṁpule rem̐save

(||vām̐ḍi||)
kaivasamai yuṁḍide kaḍam̐gu juṭṭarigamu
sevaderam̐ bĕnam̐gide sem̐ta līḍeru
yīveḽa nalamelmaṁga vinniḍānu ninnunelĕ
śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ḍu sevalĕllām̐ jeyave