వాఁడిగో దగ్గరి వచ్చె వద్దే యింత
(॥పల్లవి॥)
వాఁడిగో దగ్గరి వచ్చె వద్దే యింత
ఆఁడుదాన వెదురేఁగి యందము గైకొనవే
(॥॥)
యీతఁడు విచ్చేయుటేడ ఇంతేసి మాట లేడ
రాతిరెల్లా నీవు నిద్రవోతివో పోవో
చేతికి లోనైనవేళఁ జేతురా యింత యగడు
యేతవ లెత్తాడఁ బతి నిల్లాలికిఁ జెల్లునా
(॥॥)
నిన్నతఁడు చూచుటెంత నీవు తలవంచు టెంత
కన్నెకోప మెంత మూఁట గట్టుకొంటివో
మన్నించ వచ్చినవేళ మగవానిఁ బరతురా
తిన్నని పంతాలు చూప దేవులకుఁ జెల్లునా
(॥॥)
మగఁ డాడ వుండనేల మంచాన నీ వుండనేల
బిగువే నీకు వెన్నెతోఁ బెట్టిరో యేమో
నగుతా శ్రీ వేంకటాద్రి నాథుడు గూడెఁ గమ్మటి
జగడాలు రాణివాసములకుఁ జెల్లునా
(||pallavi||)
vām̐ḍigo daggari vachchĕ vadde yiṁta
ām̐ḍudāna vĕdurem̐gi yaṁdamu gaigŏnave
(||||)
yīdam̐ḍu vichcheyuḍeḍa iṁtesi māḍa leḍa
rādirĕllā nīvu nidravodivo povo
sedigi lonainaveḽam̐ jedurā yiṁta yagaḍu
yedava lĕttāḍam̐ badi nillāligim̐ jĕllunā
(||||)
ninnadam̐ḍu sūsuḍĕṁta nīvu talavaṁchu ṭĕṁta
kannĕgoba mĕṁta mūm̐ṭa gaṭṭugŏṁṭivo
manniṁcha vachchinaveḽa magavānim̐ baradurā
tinnani paṁtālu sūba devulagum̐ jĕllunā
(||||)
magam̐ ḍāḍa vuṁḍanela maṁchāna nī vuṁḍanela
biguve nīgu vĕnnĕdom̐ bĕṭṭiro yemo
nagudā śhrī veṁkaḍādri nāthuḍu gūḍĕm̐ gammaḍi
jagaḍālu rāṇivāsamulagum̐ jĕllunā