వాఁడి గలవాఁడ వౌత వడి నే మెఱుఁగుదుము
(॥పల్లవి॥)
వాఁడి గలవాఁడ వౌత వడి నే మెఱుఁగుదుము
వేఁడిమి దుష్టులమీఁద విసరంగ రాదా
(॥వాడి॥)
వోప నంటాఁ బెనఁగితే నుడికి తిట్ట వచ్చేవు
ఆపనికే యెంత కెంత ఔరా నీవు
కోపము గలిగితేను గురిఁ బగవారిమీఁదఁ
జూప రాదా యీడ నేల చూపేవు నీవు
(॥వాడి॥)
తనిసినవారిమీఁదఁ దగఁ జేతులు చాఁచేవు
యెన లేనికాఁకతోడ నేరానీవు
మొన చూప వలసితే ముంచి నీకు నెదిరించి
చెనకెటివారపైనే చేఁత సేయ రాదా
(॥వాడి॥)
పొలసి నంతటిలోనె పొదిగి నన్నుఁ గూడితి
మెలుపు శ్రీవెంకటేశ మేలురా నీవు
బలిమి నీకుఁ గలితే పౌఁజులమీఁద నురికి
వలసినట్టు మెరయ వద్దనేనా నేను
(||pallavi||)
vām̐ḍi galavām̐ḍa vauda vaḍi ne mĕṟum̐gudumu
vem̐ḍimi duṣhṭulamīm̐da visaraṁga rādā
(||vāḍi||)
voba naṁṭām̐ bĕnam̐gide nuḍigi tiṭṭa vachchevu
ābanige yĕṁta kĕṁta aurā nīvu
kobamu galigidenu gurim̐ bagavārimīm̐dam̐
jūba rādā yīḍa nela sūbevu nīvu
(||vāḍi||)
tanisinavārimīm̐dam̐ dagam̐ jedulu sām̐sevu
yĕna lenigām̐kadoḍa nerānīvu
mŏna sūba valaside muṁchi nīgu nĕdiriṁchi
sĕnagĕḍivārabaine sem̐ta seya rādā
(||vāḍi||)
pŏlasi naṁtaḍilonĕ pŏdigi nannum̐ gūḍidi
mĕlubu śhrīvĕṁkaḍeśha melurā nīvu
balimi nīgum̐ galide paum̐julamīm̐da nurigi
valasinaṭṭu mĕraya vaddanenā nenu