Vaamde vo prahlaadavaradumdu

వాఁడె వో ప్రహ్లాదవరదుఁడు
Language

(॥పల్లవి॥)
వాఁడె వో ప్రహ్లాదవరదుఁడు
వాఁడె వో భక్తవత్సలుఁడు

(॥వాఁడె ॥)
కోర దవడలతోడ కోటి సూర్యతేజముతో
హారకేయూరాది భూషణాంబరాలతో
చేరి బ్రహ్మాదులెల్లాను సేవలు సేయఁగాను
మేర మీరిన శిరుల మేడలో నున్నాఁడు

(॥వాఁడె ॥)
తెల్లని మేనితోడ తీగెనవ్వులతోడ
చల్లని గంధముల వాసనలతోడ
పెల్లుగా నారదాదులు పేరుకొని నుతించఁగా
వెల్లవిరిఁ గొలువై వేడుక నున్నాడు

(॥వాఁడె ॥)
సంకుఁజక్రముల తోడ జంట పూదండలతోడ
పొంకపు నానావిధ భోగములతో
అంకపు శ్రీవేంకటాద్రి నహోబలమునందు
అంకెలనే పొద్దూ నెలవై తానున్నాఁడు

(||pallavi||)
vām̐ḍĕ vo prahlādavaradum̐ḍu
vām̐ḍĕ vo bhaktavatsalum̐ḍu

(||vām̐ḍĕ ||)
kora davaḍaladoḍa koḍi sūryadejamudo
hārageyūrādi bhūṣhaṇāṁbarālado
seri brahmādulĕllānu sevalu seyam̐gānu
mera mīrina śhirula meḍalo nunnām̐ḍu

(||vām̐ḍĕ ||)
tĕllani menidoḍa tīgĕnavvuladoḍa
sallani gaṁdhamula vāsanaladoḍa
pĕllugā nāradādulu perugŏni nudiṁcham̐gā
vĕllavirim̐ gŏluvai veḍuga nunnāḍu

(||vām̐ḍĕ ||)
saṁkum̐jakramula toḍa jaṁṭa pūdaṁḍaladoḍa
pŏṁkabu nānāvidha bhogamulado
aṁkabu śhrīveṁkaḍādri nahobalamunaṁdu
aṁkĕlane pŏddū nĕlavai tānunnām̐ḍu