Vaamde vaamde veemde veemde vaadalalo meraseeni

వాఁడె వాఁడె వీఁడె వీఁడె వాడలలో మెరసీని
Language

(॥పల్లవి॥)
వాఁడె వాఁడె వీఁడె వీఁడె వాడలలో మెరసీని
ఆఁడుల నడుమనెంత అలరీని చూడరే

(॥వాఁడే॥)
కనకపు రథమెక్కి కప్పురము చల్లీని
వనితలమీఁదట శ్రీవల్లభుఁడు
వినువీధి మించినట్టి వేంకటాచలముమీఁద
నినుపుఁ జందురుఁడు వెన్నెలగాసినట్లు

(॥వాఁడే॥)
దేవాసనముమీఁదఁ దిరమై పన్నీరు చల్లీ
వేవేలు సతులమీఁద విశ్వమూరితి
చేవమీరి శేషాద్రిశిఖరము మీఁదను
భావింప మేఘము జడివట్టి మించినట్లు

(॥వాఁడే॥)
పసిఁడిదండెల పీఁటపై నుండి పూవుల వేసీ
వెస నలమేల్మంగ శ్రీవేంకటేశుఁడు
మిసిమి నంజనగిరిమీఁద వసంతవేళను
వెసఁ గల్పవృక్షము విరులిచ్చినట్లు

(||pallavi||)
vām̐ḍĕ vām̐ḍĕ vīm̐ḍĕ vīm̐ḍĕ vāḍalalo mĕrasīni
ām̐ḍula naḍumanĕṁta alarīni sūḍare

(||vām̐ḍe||)
kanagabu rathamĕkki kappuramu sallīni
vanidalamīm̐daḍa śhrīvallabhum̐ḍu
vinuvīdhi miṁchinaṭṭi veṁkaḍāsalamumīm̐da
ninubum̐ jaṁdurum̐ḍu vĕnnĕlagāsinaṭlu

(||vām̐ḍe||)
devāsanamumīm̐dam̐ diramai pannīru sallī
vevelu sadulamīm̐da viśhvamūridi
sevamīri śheṣhādriśhikharamu mīm̐danu
bhāviṁpa meghamu jaḍivaṭṭi miṁchinaṭlu

(||vām̐ḍe||)
pasim̐ḍidaṁḍĕla pīm̐ṭabai nuṁḍi pūvula vesī
vĕsa nalamelmaṁga śhrīveṁkaḍeśhum̐ḍu
misimi naṁjanagirimīm̐da vasaṁtaveḽanu
vĕsam̐ galbavṛkṣhamu virulichchinaṭlu