వాఁడే వాఁడే అల్లరివాఁ డదివో
(॥పల్లవి॥)
వాఁడే వాఁడే అల్లరివాఁ డదివో
నాఁడు నాఁడు యమునానదిలోన
(॥॥)
కాంతలు వలయపుకంకణరవములఁ
నంతంతఁ గోలాటమాడఁగను
చెంతల నడుమను శ్రీరమణుఁ డమరె
సంతతపుఁజుక్కలలో చంద్రునివలెను
(॥॥)
మగువలు ముఖపద్మములు దిరిగిరా-
నగపడి కోలాటమాడఁగను
నిగిడీ నడుమ నదె నీలవర్ణుఁడు
పగటుతోఁ గమలబంధునివలెను
(॥॥)
గోపిక లీరీతిఁ గోలాటమాడఁగ
యేపున శ్రీవేంకటేశ్వరుఁడు
వోపెలమేల్మంగ నురమున నిడుకొని
దీపించె మణులలో తేజమువలెను
(||pallavi||)
vām̐ḍe vām̐ḍe allarivām̐ ḍadivo
nām̐ḍu nām̐ḍu yamunānadilona
(||||)
kāṁtalu valayabugaṁkaṇaravamulam̐
naṁtaṁtam̐ golāḍamāḍam̐ganu
sĕṁtala naḍumanu śhrīramaṇum̐ ḍamarĕ
saṁtadabum̐jukkalalo saṁdrunivalĕnu
(||||)
maguvalu mukhabadmamulu dirigirā-
nagabaḍi kolāḍamāḍam̐ganu
nigiḍī naḍuma nadĕ nīlavarṇum̐ḍu
pagaḍudom̐ gamalabaṁdhunivalĕnu
(||||)
gobiga līrīdim̐ golāḍamāḍam̐ga
yebuna śhrīveṁkaḍeśhvarum̐ḍu
vobĕlamelmaṁga nuramuna niḍugŏni
dībiṁchĕ maṇulalo tejamuvalĕnu