వాఁడే నీపతి వాఁడే సరసుఁడు వాఁడే చతురుఁడు
(॥పల్లవి॥)
వాఁడే నీపతి వాఁడే సరసుఁడు వాఁడే చతురుఁడు
నేఁడు నీ కీ సిరులు దొరకెను నీవు సేసిన భాగ్యమే
(॥వాఁడే॥)
తమక మేటికే యాతఁడే యీడకు తానే రాఁగాను
రమణి నీవే విన్నవించవే రతిరహస్యములు
జమళి సిగ్గుల నాడఁజాలక సతుల నంపుదురా
కొమెర వయసిదే చేతి కబ్చెను కొంక నేమిటికే
(॥వాఁడే॥)
వినయ మేటికి ఆతఁడే నిన్నును వేఁడుకొనఁగాను
మనసు నీవే కరఁచఁ గదవే మర్మములు రేఁచి
చెనకువేళల నీవు లోఁగుచు చెలుల నంపుదురా
వినవే నేర్పులు నీకుఁగలుగఁగ వెనకతియ్యకువే
(॥వాఁడే॥)
నగవు లేటికే శ్రీవేంకటనాథుఁ డొరయఁగను
అగడు నీవే సేయఁ గదవే అతనిఁ గుచములను
మగఁడు నీవునుఁ గూడి తగవులు మమ్ము నడుగుదురా
నిగిడి నీకే తెలునింకను నీవు లోఁగకువే
(||pallavi||)
vām̐ḍe nībadi vām̐ḍe sarasum̐ḍu vām̐ḍe sadurum̐ḍu
nem̐ḍu nī kī sirulu dŏragĕnu nīvu sesina bhāgyame
(||vām̐ḍe||)
tamaga meḍige yādam̐ḍe yīḍagu tāne rām̐gānu
ramaṇi nīve vinnaviṁchave radirahasyamulu
jamaḽi siggula nāḍam̐jālaga sadula naṁpudurā
kŏmĕra vayaside sedi kabchĕnu kŏṁka nemiḍige
(||vām̐ḍe||)
vinaya meḍigi ādam̐ḍe ninnunu vem̐ḍugŏnam̐gānu
manasu nīve karam̐sam̐ gadave marmamulu rem̐si
sĕnaguveḽala nīvu lom̐gusu sĕlula naṁpudurā
vinave nerbulu nīgum̐galugam̐ga vĕnagadiyyaguve
(||vām̐ḍe||)
nagavu leḍige śhrīveṁkaḍanāthum̐ ḍŏrayam̐ganu
agaḍu nīve seyam̐ gadave adanim̐ gusamulanu
magam̐ḍu nīvunum̐ gūḍi tagavulu mammu naḍugudurā
nigiḍi nīge tĕluniṁkanu nīvu lom̐gaguve