వాఁడె బీర మాడఁగా వలదు మాను మనదు
(॥పల్లవి॥)
వాఁడె బీర మాడఁగా వలదు మాను మనదు
ఆఁడువారి బతుకు లివే అన్నియు వినరమ్మా
(॥వాఁడే॥)
తానే ననుఁ దొలుత తగుల నాడినాఁడు
నే నావెనక నలిగితే నేర మిందు గలదా
కానీ చెలులాల కల్లలాడ వలదే
పూని తగదన్న వారికి బుద్ది చెప్పరమ్మా
(॥వాఁడే॥)
చేరి నను నిపుడేజీరవారఁ దీసెఁ దాను
మేర నే నందుకుఁ దా మీకుఁ జెప్పరాదా
సారె మిము నేను సాకి రడుగఁ గాను
దూరు మీకుఁ గట్టుకో దోస మేఁటికమ్మా
(॥వాఁడే॥)
కూడి నామోము కొసరి చూడఁగాను
యీడు వెట్టుక నాకును యింత నవ్వరాదా
తోడి వేంకటపతి దొమ్మిసేసి కలసె
పాడిగలసతు లిందరు పంత మడుగరమ్మా
(||pallavi||)
vām̐ḍĕ bīra māḍam̐gā valadu mānu manadu
ām̐ḍuvāri badugu live anniyu vinarammā
(||vām̐ḍe||)
tāne nanum̐ dŏluda tagula nāḍinām̐ḍu
ne nāvĕnaga naligide nera miṁdu galadā
kānī sĕlulāla kallalāḍa valade
pūni tagadanna vārigi buddi sĕpparammā
(||vām̐ḍe||)
seri nanu nibuḍejīravāram̐ dīsĕm̐ dānu
mera ne naṁdugum̐ dā mīgum̐ jĕpparādā
sārĕ mimu nenu sāgi raḍugam̐ gānu
dūru mīgum̐ gaṭṭugo dosa mem̐ṭigammā
(||vām̐ḍe||)
kūḍi nāmomu kŏsari sūḍam̐gānu
yīḍu vĕṭṭuga nāgunu yiṁta navvarādā
toḍi veṁkaḍabadi dŏmmisesi kalasĕ
pāḍigalasadu liṁdaru paṁta maḍugarammā