Vaamana nrsimha vaasudeva hari

వామన నృసింహ వాసుదేవ హరి
Language

(॥పల్లవి॥)
వామన నృసింహ వాసుదేవ హరి
నీ మహిమఁ గదా నిర్మలులైరి

(॥వామన॥)
సనకసనందన సనత్కుమారులు
సనత్సుజాతాది సంయములు
వినయముతో ధ్రువ విభీషణాదులు
నినుఁ గొలిచి కదా నిర్మలు లైరి

(॥వామన॥)
నారదశుక శౌనకహనుమంతులు
పారాశర్య ప్రముఖులును
ధారుణి రుక్మాంగద ప్రహ్లాదులు
నీ రచనఁ గదా నిర్మలు లైరి

(॥వామన॥)
కరిపుండరీక గాంగేయవసిష్టు
లరిది నంబరీషార్జునులు
యిరవుగ శ్రీవేంకటేశ నీ పాదములు
నిరతిఁ గని కదా నిర్మలు లైరి

(||pallavi||)
vāmana nṛsiṁha vāsudeva hari
nī mahimam̐ gadā nirmalulairi

(||vāmana||)
sanagasanaṁdana sanatkumārulu
sanatsujādādi saṁyamulu
vinayamudo dhruva vibhīṣhaṇādulu
ninum̐ gŏlisi kadā nirmalu lairi

(||vāmana||)
nāradaśhuga śhaunagahanumaṁtulu
pārāśharya pramukhulunu
dhāruṇi rukmāṁgada prahlādulu
nī rasanam̐ gadā nirmalu lairi

(||vāmana||)
karibuṁḍarīga gāṁgeyavasiṣhṭu
laridi naṁbarīṣhārjunulu
yiravuga śhrīveṁkaḍeśha nī pādamulu
niradim̐ gani kadā nirmalu lairi