Vaagiligaa seyatti vanidalamide nemu

వాకిలిగా చేయట్టి వనితలమిదె నేము
Language

(॥పల్లవి॥)
వాకిలిగా చేయట్టి వనితలమిదె నేము
జోక దప్పకురే మీరు సుదతులాలా

(॥॥)
మచ్చిక నాతఁడు నాకె మాటలాడుకొనఁ గాను
అచ్చముగ మీరేల ఆలకించేరే
యిచ్చగించి వేడుకతో నేకతాన నుండఁ గాను
కొచ్చి తెరయెత్తే రేలే కొమ్మలాలా

(॥॥)
కొత్తగా నద్దాలు చూచుకొని వారు నవ్వఁ గాను
చిత్తిణి చేఁతల నేల చేరవచ్చేరే
హత్తి పందేలతోడుత నటు చదురంగమాడే-
రెత్తులేల చెప్పేరే యింతులాలా

(॥॥)
శ్రీ వేంటేశుఁడు లోన దేవులఁ జెనకఁ గాను
యీవేళఁ గానుకలేల యియ్యవచ్చేరే
వేవేలురతులఁ గూడి వెసఁ బీఁటపై నుండఁ గా
బావంటాఁ బై కొనేరేలే పడఁతులాలా

(||pallavi||)
vāgiligā seyaṭṭi vanidalamidĕ nemu
joga dappagure mīru sudadulālā

(||||)
machchiga nādam̐ḍu nāgĕ māḍalāḍugŏnam̐ gānu
achchamuga mīrela ālagiṁchere
yichchagiṁchi veḍugado negadāna nuṁḍam̐ gānu
kŏchchi tĕrayĕtte rele kŏmmalālā

(||||)
kŏttagā naddālu sūsugŏni vāru navvam̐ gānu
sittiṇi sem̐tala nela seravachchere
hatti paṁdeladoḍuda naḍu saduraṁgamāḍe-
rĕttulela sĕppere yiṁtulālā

(||||)
śhrī veṁṭeśhum̐ḍu lona devulam̐ jĕnagam̐ gānu
yīveḽam̐ gānugalela yiyyavachchere
veveluradulam̐ gūḍi vĕsam̐ bīm̐ṭabai nuṁḍam̐ gā
bāvaṁṭām̐ bai kŏnerele paḍam̐tulālā