వాకిలి గాచుకొనివుండే వనితలము నేమెల్లా
(॥పల్లవి॥)
వాకిలి గాచుకొనివుండే వనితలము నేమెల్లా
చేకొని వేళయైతేఁ జెప్పేము గాని
(॥॥)
మేడలో దేవులుఁ దాము మెరసి మాటలాడేరు
వేడుకతో సవతులు వినఁబోకురే
కూడిమాడి నవ్వుకుంటాఁ గూచున్నాడు నాయకుఁడు
చూడకురే యీదిక్కు సుదతులాల
(॥॥)
పానుపుపైనుండి వారే బాగాలు వేసుకునేరు
కానుక లిచ్చేమంటా దగ్గరఁ బోకురే
ఆనుక పూవుల వేట్లాడేదు కొప్పులు జార
పానిపట్టి రొదసేసి పరాకు సేయకురే
(॥॥)
లలి శ్రీవేంకటేశుఁ డలమేల్మంగాఁ గూడున్నారు
బలిమితో లోనికు గొబ్బనఁ బోకురే
పిలిచే రదివో మిమ్ముఁ బ్రియములతోఁ దామే
సలిగె గల వారలు సందడించకురే
(||pallavi||)
vāgili gāsugŏnivuṁḍe vanidalamu nemĕllā
segŏni veḽayaidem̐ jĕppemu gāni
(||||)
meḍalo devulum̐ dāmu mĕrasi māḍalāḍeru
veḍugado savadulu vinam̐bogure
kūḍimāḍi navvuguṁṭām̐ gūsunnāḍu nāyagum̐ḍu
sūḍagure yīdikku sudadulāla
(||||)
pānububainuṁḍi vāre bāgālu vesuguneru
kānuga lichchemaṁṭā daggaram̐ bogure
ānuga pūvula veṭlāḍedu kŏppulu jāra
pānibaṭṭi rŏdasesi parāgu seyagure
(||||)
lali śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁgām̐ gūḍunnāru
balimido lonigu gŏbbanam̐ bogure
pilise radivo mimmum̐ briyamuladom̐ dāme
saligĕ gala vāralu saṁdaḍiṁchagure