Vaagidigi vachchimnaadu vanida nee ramanumdu

వాకిటికి వచ్చిఁనాడు వనిత నీ రమణుఁడు
Language

(॥పల్లవి॥)
వాకిటికి వచ్చిఁనాడు వనిత నీ రమణుఁడు
కైకొని యలుకలేల కడుఁ దడవేల

(॥వాకి॥)
కప్పురవిడియ మిదె గందవొడిబరణిదె
దప్పి మోవి యండనేల తలపోఁతేల
కుప్పలై నవిరు లవె కోరతట్టుపునుఁగిదె
కొప్పు ముడువవిదేల కొమ్మ నీవు నేఁడు

(॥వాకి॥)
బంగారుసురటి యదె పచ్చికస్తూరి యిదె
పోంగెటిచెమట యేల బుసకొట్లేల
రంగుమీర నద్ద మదే రచనలసొమ్ము లవే
సింగారించ విదియేల చెలియరో నేఁడు

(॥వాకి॥)
చేరువనే పానుపిదే శ్రీవేంకటేశుఁడు వీఁడె
మారుమోము లింకనేల మంకులేల
వూరకే యాతఁడు నిన్ను నొడఁబాటు చేసి కూడె
బీరమేల కమ్మరాను పిలువవే నేఁడు

(||pallavi||)
vāgiḍigi vachchim̐nāḍu vanida nī ramaṇum̐ḍu
kaigŏni yalugalela kaḍum̐ daḍavela

(||vāgi||)
kappuraviḍiya midĕ gaṁdavŏḍibaraṇidĕ
dappi movi yaṁḍanela talabom̐tela
kuppalai naviru lavĕ koradaṭṭubunum̐gidĕ
kŏppu muḍuvavidela kŏmma nīvu nem̐ḍu

(||vāgi||)
baṁgārusuraḍi yadĕ pachchigastūri yidĕ
poṁgĕḍisĕmaḍa yela busagŏṭlela
raṁgumīra nadda made rasanalasŏmmu lave
siṁgāriṁcha vidiyela sĕliyaro nem̐ḍu

(||vāgi||)
seruvane pānubide śhrīveṁkaḍeśhum̐ḍu vīm̐ḍĕ
mārumomu liṁkanela maṁkulela
vūrage yādam̐ḍu ninnu nŏḍam̐bāḍu sesi kūḍĕ
bīramela kammarānu piluvave nem̐ḍu