వాకిటి కప్పటనుండి వచ్చివున్నదాన నేను
(॥పల్లవి॥)
వాకిటి కప్పటనుండి వచ్చివున్నదాన నేను
కాకుసేయ కాతని నిక్కడికి నంపఁగదే
(॥వాకి॥)
చెంతల నాతని నొంటిఁ జిక్కించుక యేమేమో
మంతనములాడేవేమే మాపుదాఁకాను
వింతగా నాతనిచేత వీణె వాయింపించుకొంటా
యెంతభ్రమలఁబెట్టేవే ఇంటిలోనను
(॥వాకి॥)
పచ్చడము గప్పుకొని పతిపక్కఁబండుండి
యిచ్చకా లేమిసేసేవే యెందాఁకాను
పచ్చిగా నెటిపెటిని బాగా లొత్తియిచ్చుకొంటా
మచ్చిక లెంతచూపెవే మఱఁగునను
(॥వాకి॥)
ప్రేమమున లోలోనె పెనఁగులాడుకొంటాను
వేమారు నేమి నవ్వేరే వేగుదాఁకాను
ఆముక శ్రీవేంకటేశుఁడంతలోనే నన్ను నెలె
యేమే నన్ను మెచ్చేవే యిందుకుఁగాను
(||pallavi||)
vāgiḍi kappaḍanuṁḍi vachchivunnadāna nenu
kāguseya kādani nikkaḍigi naṁpam̐gade
(||vāgi||)
sĕṁtala nādani nŏṁṭim̐ jikkiṁchuga yememo
maṁtanamulāḍeveme mābudām̐kānu
viṁtagā nādaniseda vīṇĕ vāyiṁpiṁchugŏṁṭā
yĕṁtabhramalam̐bĕṭṭeve iṁṭilonanu
(||vāgi||)
pachchaḍamu gappugŏni padibakkam̐baṁḍuṁḍi
yichchagā lemiseseve yĕṁdām̐kānu
pachchigā nĕḍibĕḍini bāgā lŏttiyichchugŏṁṭā
machchiga lĕṁtasūbĕve maṟam̐gunanu
(||vāgi||)
premamuna lolonĕ pĕnam̐gulāḍugŏṁṭānu
vemāru nemi navvere vegudām̐kānu
āmuga śhrīveṁkaḍeśhum̐ḍaṁtalone nannu nĕlĕ
yeme nannu mĕchcheve yiṁdugum̐gānu