Vaagidam gaasugunnadi vachchinadaamkaa neevu

వాకిటఁ గాచుకున్నది వచ్చినదాఁకా నీవు
Language

(॥పల్లవి॥)
వాకిటఁ గాచుకున్నది వచ్చినదాఁకా నీవు
జోకతోడుత నెదురు చూచీ రావయ్యా

(॥వాకి॥)
విందుగాఁ దనయింటికి విచ్చేయు మనె నిన్ను
అందుకోవయ్యా కానికె అంపె నీకాపె
చెంది నిన్నుఁ దోడుకొని చేరి కొల్చి రమ్మనె
అందలము వుత్తెంచె నదిగో రావయ్యా

(॥వాకి॥)
దండిగా నొసల నక్షంతలు నీకుఁ బెట్టుమనె
దండము వెట్టుమనెను తనమారుగా
యెండ గాకుండా గొడుగు యిదే పట్టుక రమ్మనె
అండనే ముద్దుటుంగర మంపెను రావయ్యా

(॥వాకి॥)
కోరి పైడి పీఁటమీఁదఁ గూచుండఁ బెట్టుమనె
చేరె నీసంగడికిఁ దాఁ జేకొను మిఁక
యీరీతి శ్రీవేంకటేశ యీకె యలమేల్మంగ
కూరిమితోఁ గూడితివి గుట్టున రావయ్యా

(||pallavi||)
vāgiḍam̐ gāsugunnadi vachchinadām̐kā nīvu
jogadoḍuda nĕduru sūsī rāvayyā

(||vāgi||)
viṁdugām̐ danayiṁṭigi vichcheyu manĕ ninnu
aṁdugovayyā kānigĕ aṁpĕ nīgābĕ
sĕṁdi ninnum̐ doḍugŏni seri kŏlsi rammanĕ
aṁdalamu vuttĕṁchĕ nadigo rāvayyā

(||vāgi||)
daṁḍigā nŏsala nakṣhaṁtalu nīgum̐ bĕṭṭumanĕ
daṁḍamu vĕṭṭumanĕnu tanamārugā
yĕṁḍa gāguṁḍā gŏḍugu yide paṭṭuga rammanĕ
aṁḍane mudduḍuṁgara maṁpĕnu rāvayyā

(||vāgi||)
kori paiḍi pīm̐ṭamīm̐dam̐ gūsuṁḍam̐ bĕṭṭumanĕ
serĕ nīsaṁgaḍigim̐ dām̐ jegŏnu mim̐ka
yīrīdi śhrīveṁkaḍeśha yīgĕ yalamelmaṁga
kūrimidom̐ gūḍidivi guṭṭuna rāvayyā