వాకిట వచ్చివున్నాఁడు వాఁడివో నీ రమణుఁడు
(॥పల్లవి॥)
వాకిట వచ్చివున్నాఁడు వాఁడివో నీ రమణుఁడు
చేకొని వుపచారాలు చెప్పవలదటవే
(॥వాకి॥)
పొంతనే చుట్టరికాన పొందులు చేసినవారు
యెంతైనా యెగ్గులుఁ దప్పు లెంతురటవే
చింతదీర మాఁటపట్టుచేసుకొన్న యట్టివారు
వింతవా రేమిచెప్పినా విననేర్తురటవే
(॥వాకి॥)
వొనరఁగఁ బ్రాణములు వొక్కటైవుండినవారు
తనివోనిముచ్చటలు దాఁతురటవే
చనవున రతికి నాసలఁబొరలేటివారు
పెనఁగక సిగ్గులెల్లాఁ బెంతురటవే
(॥వాకి॥)
విచ్చనవిడిని తాము వేడుకపడినవారు
కొచ్చికొచ్చి గుట్టునఁ గొంకుదురటవే
అచ్చపుశ్రీవేంకటేశుఁ డలమేల్మగవునీవు
తచ్చి కూడితిరి నవ్వఁదగవులౌనటవే
(||pallavi||)
vāgiḍa vachchivunnām̐ḍu vām̐ḍivo nī ramaṇum̐ḍu
segŏni vubasārālu sĕppavaladaḍave
(||vāgi||)
pŏṁtane suṭṭarigāna pŏṁdulu sesinavāru
yĕṁtainā yĕggulum̐ dappu lĕṁturaḍave
siṁtadīra mām̐ṭabaṭṭusesugŏnna yaṭṭivāru
viṁtavā remisĕppinā vinanerduraḍave
(||vāgi||)
vŏnaram̐gam̐ brāṇamulu vŏkkaḍaivuṁḍinavāru
tanivonimuchchaḍalu dām̐turaḍave
sanavuna radigi nāsalam̐bŏraleḍivāru
pĕnam̐gaga siggulĕllām̐ bĕṁturaḍave
(||vāgi||)
vichchanaviḍini tāmu veḍugabaḍinavāru
kŏchchigŏchchi guṭṭunam̐ gŏṁkuduraḍave
achchabuśhrīveṁkaḍeśhum̐ ḍalamelmagavunīvu
tachchi kūḍidiri navvam̐dagavulaunaḍave