Vaagida ramanumde vachchi yunnaamdu

వాకిట రమణుఁడే వచ్చి యున్నాఁడు
Language

(॥పల్లవి॥)
వాకిట రమణుఁడే వచ్చి యున్నాఁడు
జోకలెల్లా వారు వారే చూచుకొనే రిఁకను

(॥వాకిట॥)
ఆలిగి లోని కేఁగియట్టె గడెవెట్టు కొని
పలుకదు పిలిచినా పతితోను
తలుపు దెరవరే దండనున్న వూడిగపు
చెలులాల మన కేల చెల్లదు నిష్టూరము

(॥వాకిట॥)
తిద్దరానిజగడాన తెఱవ మేడపై నెక్కె
మిద్దెమీఁదికిఁదీయించె మె ట్లెల్లాను
వొద్దు నిచ్చెను వేయరే వూడిగపుచెలులము
యిద్దరికి సమమే యేఁటికి నిష్టూరము

(॥వాకిట॥)
ఆడకే శ్రీవేంకటేశుఁ డానలెట్టి రప్పించి
కూడె నీ సతిని మన కొరత లేల
వూడిగపు చెలులము వొకరొక రేమనినా
యీడకు నిచ్చలాడరే యేఁటికి నిష్టూరము

(||pallavi||)
vāgiḍa ramaṇum̐ḍe vachchi yunnām̐ḍu
jogalĕllā vāru vāre sūsugŏne rim̐kanu

(||vāgiḍa||)
āligi loni kem̐giyaṭṭĕ gaḍĕvĕṭṭu kŏni
palugadu pilisinā padidonu
talubu dĕravare daṁḍanunna vūḍigabu
sĕlulāla mana kela sĕlladu niṣhṭūramu

(||vāgiḍa||)
tiddarānijagaḍāna tĕṟava meḍabai nĕkkĕ
middĕmīm̐digim̐dīyiṁchĕ mĕ ṭlĕllānu
vŏddu nichchĕnu veyare vūḍigabusĕlulamu
yiddarigi samame yem̐ṭigi niṣhṭūramu

(||vāgiḍa||)
āḍage śhrīveṁkaḍeśhum̐ ḍānalĕṭṭi rappiṁchi
kūḍĕ nī sadini mana kŏrada lela
vūḍigabu sĕlulamu vŏgarŏga remaninā
yīḍagu nichchalāḍare yem̐ṭigi niṣhṭūramu