వాకిట నేమి సేసేవు వనిత నీకు మేలుది
(॥పల్లవి॥)
వాకిట నేమి సేసేవు వనిత నీకు మేలుది
దాకొని నీ వొడఁబాటు తప్పకువయ్యా
(॥వాకి॥)
వెన్నెల బాయటనుండి వెలఁది నిన్నుఁ బిలిచీ
పన్నుకొని మరియేమో పని గద్దంటా
యిన్నిటా నే మాడిగితే నించుకంతైనాఁ జెప్పదు
విన్నపమేమి సేసీనో విందువు రావయ్య
(॥వాకి॥)
మేడలోననుండి నీకు మెలుఁత లేక లంపె
జోడుగూడి సంతోసపు సుద్దులకును
వోడక ముద్దురతోనే వున్నవి నేమెరఁగము
జాడతోడ నీకు నీవే చదువుకోవయ్యా
(॥వాకి॥)
యింటితోనుండి వుంగర మింతి నీకుఁ జూపుమనె
తొంటిమాఁట నీవే తలఁతు వనుచును
జంటై వచ్చి కూడితివి సరుగ శ్రీవేంకటేశు
అంటి యీకెతో నేకత మాడుకోవయ్యా
(||pallavi||)
vāgiḍa nemi sesevu vanida nīgu meludi
dāgŏni nī vŏḍam̐bāḍu tappaguvayyā
(||vāgi||)
vĕnnĕla bāyaḍanuṁḍi vĕlam̐di ninnum̐ bilisī
pannugŏni mariyemo pani gaddaṁṭā
yinniḍā ne māḍigide niṁchugaṁtainām̐ jĕppadu
vinnabamemi sesīno viṁduvu rāvayya
(||vāgi||)
meḍalonanuṁḍi nīgu mĕlum̐ta lega laṁpĕ
joḍugūḍi saṁtosabu suddulagunu
voḍaga mudduradone vunnavi nemĕram̐gamu
jāḍadoḍa nīgu nīve saduvugovayyā
(||vāgi||)
yiṁṭidonuṁḍi vuṁgara miṁti nīgum̐ jūbumanĕ
tŏṁṭimām̐ṭa nīve talam̐tu vanusunu
jaṁṭai vachchi kūḍidivi saruga śhrīveṁkaḍeśhu
aṁṭi yīgĕdo negada māḍugovayyā