Vaagida neevumdanela vanida lona numdaga

వాకిట నీవుండనేల వనిత లోన నుండగ
Language

(॥పల్లవి॥)
వాకిట నీవుండనేల వనిత లోన నుండగ
సాకిరివారము నేము సాదించ వచ్చేమా

(॥వాకిట॥)
పంతము నీతో నాడి పలుక కున్నది చెలి
యెంత సేసితివో నీవే యెరుఁగుదువు
మంతుకు మాతోఁ జెప్పెంపేమాటలు పనికిరావు
అంతే కలితే విచ్చేసి ఆదరించు నీవే

(॥వాకిట॥)
వొడఁబాటు వొప్పగించి వొంటినే వున్నది చెలి
అడరి నీవే నేరుతు వంతటికిని
చిడుముడి నే మొక్కటి సేసేటితతి దప్పె
వెడఁగా పె చిత్తము రా వేడుకొమ్మి నీవే

(॥వాకిట॥)
భారము నీ మీద బెట్టి పవ్వ ళించున్నది చెలి
చేరువాయఁ బనులు నీచేతిదే యిఁక
యీరీతి నా పెను గూడి యిట్టె ముంగిటఁ గూచుంటి
పేర శ్రీవేంకటేశ పిలుచుకో నీవే

(||pallavi||)
vāgiḍa nīvuṁḍanela vanida lona nuṁḍaga
sāgirivāramu nemu sādiṁcha vachchemā

(||vāgiḍa||)
paṁtamu nīdo nāḍi paluga kunnadi sĕli
yĕṁta sesidivo nīve yĕrum̐guduvu
maṁtugu mādom̐ jĕppĕṁpemāḍalu panigirāvu
aṁte kalide vichchesi ādariṁchu nīve

(||vāgiḍa||)
vŏḍam̐bāḍu vŏppagiṁchi vŏṁṭine vunnadi sĕli
aḍari nīve nerudu vaṁtaḍigini
siḍumuḍi ne mŏkkaḍi seseḍidadi dappĕ
vĕḍam̐gā pĕ sittamu rā veḍugŏmmi nīve

(||vāgiḍa||)
bhāramu nī mīda bĕṭṭi pavva ḽiṁchunnadi sĕli
seruvāyam̐ banulu nīsedide yim̐ka
yīrīdi nā pĕnu gūḍi yiṭṭĕ muṁgiḍam̐ gūsuṁṭi
pera śhrīveṁkaḍeśha pilusugo nīve