Vaagida namdarumdamgaa vadigaa lonigi nemgi

వాకిట నందరుండఁగా వడిగా లోనికి నేఁగి
Language

(॥పల్లవి॥)
వాకిట నందరుండఁగా వడిగా లోనికి నేఁగి
యేకతాననున్న పతినెట్టు చెనకితివే

(॥వాకి॥)
పాయకవిభునివద్దఁ బాదములొత్తితివా
ఆయములు గరఁగెనా అట్టె నీకు
యీయెడ వినవేడుకయ్యీ నింకానాతోఁ జెప్పవే
చేయి మీఁదాయ నిఁకసిగ్గువడనేఁటికి

(॥వాకి॥)
మనసారా నాతనీతో మాట నీవాడితివా
తనివిఁ బొందితివా తలిమితోడ
నినుఁ జూచి వెరగయ్యీ నిలువవే నామందుర
చనవరి వైతివి సట లిఁక నేఁటికి

(॥వాకి॥)
శ్రీ వేంకటేశ్వరు సేవలెల్లాఁ జేసితివా
నీవలపు లీడేరెనా నిమ్మలానను
యీవల నన్నతఁ డేలె నిట్టె కనుఁగొనవే
నీవే సవతి వైతివి నేఁడు లోఁగనేఁటికే

(||pallavi||)
vāgiḍa naṁdaruṁḍam̐gā vaḍigā lonigi nem̐gi
yegadānanunna padinĕṭṭu sĕnagidive

(||vāgi||)
pāyagavibhunivaddam̐ bādamulŏttidivā
āyamulu garam̐gĕnā aṭṭĕ nīgu
yīyĕḍa vinaveḍugayyī niṁkānādom̐ jĕppave
seyi mīm̐dāya nim̐kasigguvaḍanem̐ṭigi

(||vāgi||)
manasārā nādanīdo māḍa nīvāḍidivā
tanivim̐ bŏṁdidivā talimidoḍa
ninum̐ jūsi vĕragayyī niluvave nāmaṁdura
sanavari vaidivi saḍa lim̐ka nem̐ṭigi

(||vāgi||)
śhrī veṁkaḍeśhvaru sevalĕllām̐ jesidivā
nīvalabu līḍerĕnā nimmalānanu
yīvala nannadam̐ ḍelĕ niṭṭĕ kanum̐gŏnave
nīve savadi vaidivi nem̐ḍu lom̐ganem̐ṭige