వాకిట కాతఁడు రాఁగా వద్దంటినా
(॥పల్లవి॥)
వాకిట కాతఁడు రాఁగా వద్దంటినా
చేకొని నా కేల చెప్పేవే బుద్దులు
(॥వాకిటి॥)
మన సాతనితగులు మాటలు నీతో తగులు
వొనర నన్నే మనేవే వో చెలియ
కనుచూపు లాతనిపై కాఁకలు నామేనిమీఁద
పెనఁగీ నింకా నేల పెంచేవే దూరులు
(॥వాకటి॥)
సిగ్గు లాడ కంపితిని చెక్కుచేయి నాకు నిదె
యెగ్గులు దప్పులు లేవు యే మనేవే
దగ్గరెఁ దనపొరువు తాలిమి నాకుఁ గరవు
నిగ్గుల నాపయి నేల నించేవే కోపము
(॥వాకిటి॥)
ముంగిట నాతఁడున్నాఁడు మూల నున్నదాన నేను
అంగడి కెక్కె వలపు లవుఁ గదవే
రంగుగా శ్రీవెంటాద్రిరాయఁ డిట్టె నన్నుఁ గూడె
సంగ తాయి నీ కోరికె చల మేలే యిఁకను
(||pallavi||)
vāgiḍa kādam̐ḍu rām̐gā vaddaṁṭinā
segŏni nā kela sĕppeve buddulu
(||vāgiḍi||)
mana sādanidagulu māḍalu nīdo tagulu
vŏnara nanne maneve vo sĕliya
kanusūbu lādanibai kām̐kalu nāmenimīm̐da
pĕnam̐gī niṁkā nela pĕṁcheve dūrulu
(||vāgaḍi||)
siggu lāḍa kaṁpidini sĕkkuseyi nāgu nidĕ
yĕggulu dappulu levu ye maneve
daggarĕm̐ danabŏruvu tālimi nāgum̐ garavu
niggula nābayi nela niṁcheve kobamu
(||vāgiḍi||)
muṁgiḍa nādam̐ḍunnām̐ḍu mūla nunnadāna nenu
aṁgaḍi kĕkkĕ valabu lavum̐ gadave
raṁgugā śhrīvĕṁṭādrirāyam̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
saṁga tāyi nī korigĕ sala mele yim̐kanu