Vaadulu maadonela vaagida nunnaara mide

వాదులు మాతోనేల వాకిట నున్నార మిదే
Language

(॥పల్లవి॥)
వాదులు మాతోనేల వాకిట నున్నార మిదే
సేదదేర నీ వాపెనే చెనకవయ్యా

(॥వాదు॥)
యెదుట నిలుచుండఁగ యేమందువోయంటా
వొదిగి మంచముమీఁద నున్నది చెలి
అదన నీ కింతలోనే అందాఁకా వేగిరమైతే
పొదిగి అక్కడి కేఁగి భోగించవయ్యా

(॥వాదు॥)
తప్పక చూచితేను దంట యిది యందువంటా
వొప్పుగ తెరమాటున నున్నది చెలి
దప్పిదేర నాపె మీఁది తమకమే కలితేను
కప్పి లోని కేగిఁ నీవే కాఁగిలించవయ్యా

(॥వాదు॥)
గక్కనఁ గాఁగిలించఁగ గబ్బిది యనేవంటా
వొక్కటై వోనరిలోన నున్నది చెలి
ఇక్కువ శ్రీవేంకటేశ యింతి నిట్టె కలసితి
తక్కక యిద్దరు లోన తగిలుండరయ్యా

(||pallavi||)
vādulu mādonela vāgiḍa nunnāra mide
sedadera nī vābĕne sĕnagavayyā

(||vādu||)
yĕduḍa nilusuṁḍam̐ga yemaṁduvoyaṁṭā
vŏdigi maṁchamumīm̐da nunnadi sĕli
adana nī kiṁtalone aṁdām̐kā vegiramaide
pŏdigi akkaḍi kem̐gi bhogiṁchavayyā

(||vādu||)
tappaga sūsidenu daṁṭa yidi yaṁduvaṁṭā
vŏppuga tĕramāḍuna nunnadi sĕli
dappidera nābĕ mīm̐di tamagame kalidenu
kappi loni kegim̐ nīve kām̐giliṁchavayyā

(||vādu||)
gakkanam̐ gām̐giliṁcham̐ga gabbidi yanevaṁṭā
vŏkkaḍai vonarilona nunnadi sĕli
ikkuva śhrīveṁkaḍeśha yiṁti niṭṭĕ kalasidi
takkaga yiddaru lona tagiluṁḍarayyā