Vaadulela maadonu vatti sadalagu neevu

వాదులేల మాతోను వట్టి సటలకు నీవు
Language

(॥పల్లవి॥)
వాదులేల మాతోను వట్టి సటలకు నీవు
సేదదేరి నవ్వరాదా సేఁతలెల్లా నున్నవి

(॥వాదు॥)
తిద్దినగందపు బొట్టు తియ్యనిమోవిని గుట్టు
కద్దని నీకునీకే కానవచ్చునా
వద్దనున్న మావంటివారు చెప్పఁగా విని
అద్దము చూచు కోరాదా అన్నియును నున్నవి

(॥వాదు॥)
చెక్కుల మింతిననిగ్గు చిత్తములోపలిసిగ్గు
చొక్కుచు నింతంతని చూపవచ్చునా
దక్కియున్నారము నేము దాఁపిరాలకెల్లా మమ్ము
వక్కణ లడుగరాదా వన్నేలెల్లాఁ జెప్పేము

(॥వాదు॥)
నిలువు నివ్వెరగులు నేరుపులమరఁగులు
తొలఁకఁగా నవి నీకు దొబ్బవచ్చునా
యెలమి శ్రీవేంకటేశ ఇట్టె నన్నుఁ గూడితివి
తలపోసు కొనరాదా తగవెల్లాఁ గనేవు

(||pallavi||)
vādulela mādonu vaṭṭi saḍalagu nīvu
sedaderi navvarādā sem̐talĕllā nunnavi

(||vādu||)
tiddinagaṁdabu bŏṭṭu tiyyanimovini guṭṭu
kaddani nīgunīge kānavachchunā
vaddanunna māvaṁṭivāru sĕppam̐gā vini
addamu sūsu korādā anniyunu nunnavi

(||vādu||)
sĕkkula miṁtinaniggu sittamulobalisiggu
sŏkkusu niṁtaṁtani sūbavachchunā
dakkiyunnāramu nemu dām̐pirālagĕllā mammu
vakkaṇa laḍugarādā vannelĕllām̐ jĕppemu

(||vādu||)
niluvu nivvĕragulu nerubulamaram̐gulu
tŏlam̐kam̐gā navi nīgu dŏbbavachchunā
yĕlami śhrīveṁkaḍeśha iṭṭĕ nannum̐ gūḍidivi
talabosu kŏnarādā tagavĕllām̐ ganevu