Vaadiga nee madigini valabu vemgaa

వాడిక నీ మతికిని వలపు వేఁగా
Language

(॥పల్లవి॥)
వాడిక నీ మతికిని వలపు వేఁగా
వీడెమిచ్చి యాతనితో వేసరుకోనేలే

(॥॥)
కలికి కన్నులకును కాఁకల చూపులు వేఁగా
వొలసీ నొల్లక యాల వూరకుండేవే
పలు వన్నె నీ మోవికి పచ్చి మాటలు వేఁగా
మలసి పతితోనేల మాఁటాడవే

(॥॥)
చేతిమీఁది చెక్కులకు సెలవినవ్వులు వేఁగా
యీతలఁ జింతఁ బొరలనేలే నీకు
కాతరపు మేనికిని కమ్మఁబులకలు వేఁగా
ఘాతలఁ బయ్యద నేల కుప్పేవే నీవు

(॥॥)
కొండలకుచములకు గోరిచందురులు వేఁగా
బెండుగాఁ జెలవునితోఁ బెనఁగనేలే
ఆండనె శ్రీవెంకటేశుఁడాతఁడె నిన్నుఁ గూడెను
నిండుఁ గళలతో నీకు నివ్వెరగులేలే

(||pallavi||)
vāḍiga nī madigini valabu vem̐gā
vīḍĕmichchi yādanido vesarugonele

(||||)
kaligi kannulagunu kām̐kala sūbulu vem̐gā
vŏlasī nŏllaga yāla vūraguṁḍeve
palu vannĕ nī movigi pachchi māḍalu vem̐gā
malasi padidonela mām̐ṭāḍave

(||||)
sedimīm̐di sĕkkulagu sĕlavinavvulu vem̐gā
yīdalam̐ jiṁtam̐ bŏralanele nīgu
kādarabu menigini kammam̐bulagalu vem̐gā
ghādalam̐ bayyada nela kuppeve nīvu

(||||)
kŏṁḍalagusamulagu gorisaṁdurulu vem̐gā
bĕṁḍugām̐ jĕlavunidom̐ bĕnam̐ganele
āṁḍanĕ śhrīvĕṁkaḍeśhum̐ḍādam̐ḍĕ ninnum̐ gūḍĕnu
niṁḍum̐ gaḽalado nīgu nivvĕragulele