Vaadiga laaye nee pomdu vaasudevumdaa

వాడిక లాయె నీ పొందు వాసుదేవుఁడా
Language

(॥పల్లవి॥)
వాడిక లాయె నీ పొందు వాసుదేవుఁడా
వాడుదేరెఁ గెమ్మోవి వాసుదేవుఁడా

(॥వాడిక॥)
వాలుకచూపులు మావి వాసుదేవుఁడా మమ్ము
వాలాయించితివి నీవు వాసుదేవుఁడా
వాలారుగోళ్ల నొత్తకు వాసుదేవుఁడా నీకు
వైళమె నవ్వు వచ్చును వాసుదేవుఁడా

(॥వాడిక॥)
పలపెల్లా మా సొమ్ము వాసుదేవుఁడా యింత
వలెనా మాతోడి రట్టు వాసుదేవుఁడా
వలుములు చన్నులంటా వాసుదేవుఁడా వట్టి
వళుకులఁ బెట్టకుమీ వాసుదేవుఁడా

(॥వాడిక॥)
వడదేరె శ్రీవేంకటవాదేవుఁడా యేల
వడిసేవు తరితీపు వాసుదేవుఁడా
వడిగొనఁ గూడితివి వాసుదేవుఁడా మన
వడు వెవ్వరికిఁ గద్దు వాసుదేవుఁడా

(||pallavi||)
vāḍiga lāyĕ nī pŏṁdu vāsudevum̐ḍā
vāḍuderĕm̐ gĕmmovi vāsudevum̐ḍā

(||vāḍiga||)
vālugasūbulu māvi vāsudevum̐ḍā mammu
vālāyiṁchidivi nīvu vāsudevum̐ḍā
vālārugoḽla nŏttagu vāsudevum̐ḍā nīgu
vaiḽamĕ navvu vachchunu vāsudevum̐ḍā

(||vāḍiga||)
palabĕllā mā sŏmmu vāsudevum̐ḍā yiṁta
valĕnā mādoḍi raṭṭu vāsudevum̐ḍā
valumulu sannulaṁṭā vāsudevum̐ḍā vaṭṭi
vaḽugulam̐ bĕṭṭagumī vāsudevum̐ḍā

(||vāḍiga||)
vaḍaderĕ śhrīveṁkaḍavādevum̐ḍā yela
vaḍisevu taridību vāsudevum̐ḍā
vaḍigŏnam̐ gūḍidivi vāsudevum̐ḍā mana
vaḍu vĕvvarigim̐ gaddu vāsudevum̐ḍā